Mukesh Ambani : ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటో తెలుసా..?

ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటి. అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబానీ దంపతుల ముద్దుల మనుమరాలికి ఓ అందమైన పేరు పెట్టారు. మరి ఆ పేరేమంటే..

Mukesh Ambani : ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటో తెలుసా..?

Mukesh Ambani's grandchild Veda

Mukesh Ambani’s grandchild’s Veda : ప్రముఖ పారిశ్రామిక వేత్త,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)కి ఇటీవల మనుమరాలు జన్మించింది.ముఖేశ్ అంబానీ నీతా అంబానీ (Nita Ambani)ల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani)శ్లోకా మెహతా(Shloka Mehta Ambani)లు మే 31న రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. శ్లోకా మెహతా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. అంబానీ దంపతుల ముద్దుల మనుమరాలికి ఓ అందమైన పేరు పెట్టారు. ఈ బుజ్జిపాపకు వేద ఆకాశ్‌ అంబానీ (Veda Akash Ambani) అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం వెల్లడించింది.

Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

ఆకాశ్‌,శ్లోకా 2019 మార్చిలో వీరి వివామం ముంబైలో అంగరంగం వైభవంగా జరిగింది. రాజకీయ,సినిమా రంగాల నుంచి ఎంతోమంది ప్రముఖులు విచ్చేశారు. వీరికి 2020 డిసెంబర్‌లో కుమారుడు పుట్టాడు. అబ్బాయికి పృథ్వీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కుమారుడి వయసు రెండేళ్లు. ఇప్పుడు రెండోసారి అమ్మాయి పుట్టడంతో ఆ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

సాధారణంగా అంబానీల ఇంట ఏం జరిగినా సంచలనమే.అటువంటి వారి వంశంలో ముద్దుల మనుమరాలు పుట్టిందంటే ఇక ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మనుమరాలు పుట్టిన సందర్భంగా అంబానీ దంపతులు ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా గత ఏప్రిల్ లో నీతా ముఖఏశ్ అంబానీ కల్చరల్ సెంట్రల్ గ్రాండ్ పెనింగ్ సెలబ్రేషన్ లో శ్లోకా బేబీ బంప్ తో కనిపించారు.

Nita Ambani : నీతా అంబానీ మెస్మరైజింగ్ లుక్‌
అదే ఈవెంట్ లో కాగా ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ అతనికి కాబోయే భార్య రాధికా మచ్చంట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.ఈ ఈవెంట్ లో ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? అనే వార్తలతో ఆమె వార్తల్లో నిలిచారు.

Akash Ambani Car : ఆకాశ్‌ అంబానీ చక్కర్లుకొట్టే ఈ కారు ధర ఎంతో తెలుసా..?