fasting : 110 రోజులు కఠిన ఉపవాసం చేసిన బాలిక .. ఎందుకో తెలుసా..?
16 ఓ బాలిక ఉపవాసాలతో అరుదైన ఘనత సాధించింది. ఈ అమ్మాయి ఏదో రికార్డు కోసమో..ఘనత కోసమే ఉపవాసాలు చేయలేదు. తను నమ్మినదాని కోసం 110 రోజులు ఉపవాస దీక్ష చేసింది.
Mumbai girl 110 days fasting : ముంబైకు చెందిన 16 ఓ బాలిక ఉపవాసాలతో అరుదైన ఘనత సాధించింది. ఈ అమ్మాయి ఏదో రికార్డు కోసమో..ఘనత కోసమే ఉపవాసాలు చేయలేదు. జైన మతాన్ని నమ్మి ఏకంగా 110 రోజులు ఉపవాసాలు చేసింది. జైన మతంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. జైనులు శ్లేఖ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం పాటిస్తారు. ముంబైలో జైన కుటుంబానికి చెందిన 16 బాలిక 110 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంటూ ఏకంగా మూడు నెలల 20 రోజులు కఠిన ఉపవాసం చేసింది. ఈ 110 రోజులు ఆమె కేవలం మంచినీరు మాత్రమే తాగింది.
ముంబైలో జిగర్ షా, రూపా షా దంపతులు జైన మతాన్ని ఆచరిస్తుంటారు. వారి 16 ఏళ్ల కుమార్తె క్రిష కూడా కూడా జైన మత నియమాలను పాటిస్తుంటుంది. ఈక్రమంలో క్రిష గత జూలై 11న 16 రోజులు ఉపవాసం చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం నీళ్లు మాత్రమే తాగేది. కానీ ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని..దీంతో ఆమె ఆ ఉపవాస దీక్షను కొనసాగిందని ఆమె తల్లి రూపా షా తెలిపారు.
క్రిష తన జైన గురువు ముని పద్మకలష్ మహారాజ్ అనుమతితో 110 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు కేవలం కాచిన నీరు మాత్రమే తాగేది. కానీ ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. దీంతో ఆమె దాన్ని విజయవంతంగా ముగించింది. క్రిష ఉపవాస దీక్ష రోజుల్లో మొదటి 40 రోజులు కాలేజీకి కూడా వెళ్లింది. ఈ దీక్షతో ఆమె 18 కేజీలు బరువు తగ్గింది. అంతకు మించి ఎటువంటి అనారోగ్యా సమస్యల రాలేదు. అలా 3 నెలల 20 రోజులు తన కఠిన నిరాహార దీక్ష పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. అంతటి ఉపవాసం చేసిన అతి చిన్న వయస్కురాలు క్రిషనే కావడం విశేషం.
కాగా క్రిష తండ్రి జిగర్ షా స్టాక్ మార్కెట్ బ్రోకర్ కాగా..తల్లి రూప షా హౌస్ వైఫ్. వీరు మెహ్సానా జిల్లాలోని సల్దీ గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా క్రిష పెద్ద అమ్మాయి. క్రిష తన తొమ్మిదేళ్ల వయస్సులో ఎనిమిది రోజులు కంటిన్యూగా కఠిన ఉపవాసం చేసింది. అలాగే 14 ఏళ్ల వయస్సులో 16రోజులు చేసింది. ఇప్పుడు 16 ఏళ్ల వయస్సులో ఏకంగా 110 రోజులు ఉపవాస దీక్షను విజయవంతంగా ముగించింది అందరిని ఆశ్చర్యపరిచింది. క్రిష కండివాలిలోని కేఈఎస్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.