Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు భారీ బంగారు, వజ్రాల ఆభరణాలు ..
బొజ్జ గణపయ్య కోసం భారీ సైజుల్లో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నాడు ఓ కళాకారుడు. బొజ్జ గణపయ్య ఆకారానికి తగినట్లుగా నగలు చేయటంలో సిద్ధహస్తులుగా పేరొందారు సంజయ్ నానా వేదిక్ అనే స్వర్ణకారుడు.

Mumbai Goldartist Sanjay Nana Vedak
Gold ornaments for Ganesh : వినాయక చవితి వచ్చిందంటే దేశమంతా సందడే. ఎన్నో రకాల ఎన్నో గెటప్పులతో బొజ్జ గణపయ్యలు కొలువుతీరి పూజలందుకుంటారు. గణేశ్ నవరాత్రులు అంతా దేశమంతా సందడి సందడిగా ఉంటుంది. వినాయక మండపాలను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. దేశమంతా గణేషుడు సంబరాలు చేసినా ముంబై నగరంలో వినాయకచవితి వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి.
ఎందుకంటే గణేశుడి కోసం ఓ వ్యక్తి భారీ సైజుల్లో బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. బొజ్జ గణపయ్య ఆకారానికి తగినట్లుగా నగలు చేయటంలో సిద్ధహస్తులు సంజయ్ నానా వేదిక్ అనే స్వర్ణకారుడు. పెద్ద పెద్ద హారాలు, కిరీటాలు ఇలా ఎన్నో రకాల నగలు తయారు చేస్తుంటారు నానా వేదిక్.
సంజయ్ నానా వేదిక్. ముంబైలో ఈయన్ని నానా గౌరవంగా పిలుచుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సంజయ్ వినాయకుడి విగ్రహాల కోసం బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది వినాయక మండపాలు నెలకొల్పే కంటే ముందే ఆభరణాలకు ఆర్డర్ ఇస్తారు. ఆ ప్రతిమ ఎత్తు, వెడల్పును బట్టి కచ్చితైన కొలతలు తీసుకొని ఆభరణాలు తయారు చేయడం నానా ప్రత్యేకత.
Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బోలెడన్ని పేర్లు .. వాటి అర్థాలు, పరమార్ధాలు
ఒక్క ముంబైలోనే కాదు.. దేశ, విదేశాల్లో ఉన్న చాలా ఆలయాల్లోని విగ్రహాలు నానా ఆభరణాలు తయారు చేస్తారు. చేతి కడియాలు, నెక్లెస్, కిరీటాలు, చెవి కమ్మలు, జంధ్యం, అభయహస్తం,లాకెట్, చేతి కంకణాలు ఇలా పలు రకాల ఆభరణాలు తయారు చేయడంలో నానా సిద్ధహస్తులు.
మూడు తరాల నుంచి ఈ పనిలో ఉన్న నానాకు ముంబైలోనే నాలుగు దుకాణాలున్నాయి. సుమారు 17 మంది స్వర్ణకారులు ఈ ఆభరణాలను తయారు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విగ్రహాల గురించి ఆర్డర్లు వస్తాయి. ఆర్డర్ చేసేవారు ఇచ్చిన కొలతల ప్రకారం ఆభరణాలు తయారు చేస్తుంటారు నానా.