Delhi HC : మహిళా న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలంటూ హైకోర్టులో పిటిషన్.. షాక్ మామూలుగా లేదుగా..
హత్యలు, అత్యాచారాలు వంటి దారుణ నేరాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ బాధితులు నుంచి రావటం సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి ఏకంగా న్యాయమూర్తికే మరణశిక్ష విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఘటన షాక్ కలిగించింది.

Punjab man Controversial Petition Delhi High Court
Controversial Petition Delhi High Court : నిందితులకు శిక్ష విధించాలని.. హత్యలు, అత్యాచారాలు వంటి దారుణ నేరాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ బాధితులు నుంచి రావటం అనేది సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి ఏకంగా న్యాయమూర్తికే మరణశిక్ష విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ వివాదాస్పద పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం సదరు వ్యక్తికి గట్టి షాకిచ్చింది. ఏకంగా న్యాయమూర్తికే మరణశిక్ష విధించాలనే పిటిషన్ కోర్టు ధిక్కారానికి వస్తుందంటూ సదరు పిటిషనర్ కు షాకిస్తూ 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రూ.2 వేలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 7 రోజులు జైలు శిక్ష అనుభవించాలని జస్టిస్ సురేష్ కుమార్ కైట్, జస్టిస్ శాలిందర్ కౌర్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సదరు వ్యక్తిని తక్షణమే కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించాలని అక్టోబర్ 31న ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు పిటిషనర్ షాక్ అయ్యాడు.
సాధారణంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావటం జరుగుతుంటుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ కు చెందిన నరేశ్ శర్మ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద తనకు లభించాల్సిన హక్కుల్ని కొంతమంది ప్రముఖులు దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
Also Read : 8 ఏళ్ల పిల్లాడ్ని తెచ్చుకుని పెంచి పెళ్లి చేసుకున్న మహిళ
ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాన్నే చేర్చాడు. అంతేకాదు భారత్ లో పలువురు ప్రముఖుల పేర్లతో పాటు ఏకంగా పోలీసులు శాఖను కూడా చేర్చాడు. వీరిలో ఢిల్లీ పోలీసులు, ముంబై పోలీసులు, బెంగళూరు పోలీసులు, రతన్ టాటాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నాడు. సొంత క్రిమినల్ రికార్డులను చూసుకునే తన హక్కుకు వీరు భంగం కలిగిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు. జులై 20న ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం నరేశ్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు పిటిషన్ ను కొట్టివేసింది. ఇది ఎందుకు పనికి రానిదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రారంభంలో నరేశ్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. రూ.3వేలు జరిమానా విధించి, షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Mini Pink Bullet : బుల్లి బుల్లెట్ బండి భలే ఉందే .. !!
దీంతో నరేశ్ శర్మ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశాడు. ఈ పిటిషన్ లో చాలా పరుష పదజాలాన్ని వాడుతూ.. తాను వేసిన పిటిషన్ కొట్టివేసిన సదరు మహిళా న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలి అప్పిల్ పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతేకాదు సదరు మహిళా న్యాయమూర్తిని దెయ్యంతో పోల్చాడు. ఆమెపై పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో పిటిషన్లు వేయటంతో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నరేశ్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 6 నెలలు జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించింది. అతనిని వెంటనే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.