Rose Petals : ఈ గులాబీ రేకులు వాడిపోవు,నలిగిపోవు.. వేడుకల డెకరేషన్‌లో వీటి దర్పమే వేరు

నిజమో అబద్దమో తెలియదు. ప్రకృతి నుంచి వచ్చినవో తయారు చేసినవో తెలియదు. కానీ నిజమైనవాటిని మించి అందం వాటి సొంతం. నలిగిపోవు.వసివాడిపోవు, రంగు ఏమాత్రం తగ్గిపోవు..కాళ్లతో తొక్కినా నిగారింపు తగ్గదు..నిజమైన రోజాల కంటే మేం దేనికి తక్కువకాదనేలా ప్రీ వెడ్డింగ్ షూట్ లో గుభాళిస్తున్నాయి..

Rose Petals : ఈ గులాబీ రేకులు వాడిపోవు,నలిగిపోవు.. వేడుకల డెకరేషన్‌లో వీటి దర్పమే వేరు

Realistic rose petals

Updated On : July 26, 2023 / 5:01 PM IST

Realistic Rose Petals : గులాబీ పువ్వుల్లో రాణి. గులాబీల్లో ఎర్ర గులాబీ అందమే వేరు. ప్రేమను తెలియజేసే ఓ అద్భుతమైన సాధనం ఎర్ర గులాబీ (Red Rose). ఓ ఎర్రగులాబీ చేతికందిస్తే అది ప్రేమ. వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క ఎర్రగులాబీ చెబుతుంది. తన అందంతో, ఆకట్టుకునే దర్పంతో ప్రేమికుల భావాలను తెలుపుతుంది. ఇక అలంకారంలో కూడా ఎర్ర గులాబీ లెవలే వేరే. ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు అనే లాంటి దర్పం ఆ పువ్వుదే అంటే అతిశయోక్తి లేదు. అందుకే పెళ్లిళ్ల డెకరేషన్ (Wedding Decoration) లోనూ, వధువరుల ప్రీ వెడ్డింగ్ షూటు (pre wedding shoot) ల్లోనే గలాబీలు అగ్రస్థానంలో ఉన్నాయి. గులాబీల్లో ఎన్నో రంగులున్నాయి. ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకతలున్నాయి. రంగురంగుల రోజాలతో పాటు, గులాబీ రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అందుకుంటున్నాయి..

పెళ్లి, బర్త్‌డే పార్టీలూ, ప్రీ వెడ్డింగ్‌ షూట్లలో రోజ్‌ పెటల్‌ డెకరేషన్‌ ట్రెండ్ గా మారిపోయింది. కానీ నిజమైన గులాబీలు కొనాలంటే ఖర్చు ఎక్కువే ఉంటుంది. త్వరగా వాడిపోతాయి. అందుకే అచ్చుగుద్దినట్టు నిజమైన గులాబీ రెక్కలను పోలిన రియలిస్టిక్‌ రోజ్‌ పెటల్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి వాడిపోవు. నలిగిపోవు. వీటికి మరో ప్రత్యేకత ఏంటీ అంటూ నిజమైన గులాబీలకు ఉండే వాసన కూడా వీటికి ఉండేలా తయారు చేయటం. మరి ఆ రియలిస్టిక్ రోజ్ పెటల్స్ ప్రత్యేకత ఏంటో తేల్చుకుందాం. నిజమైన గులాబీల కంటే అందంలోను ఆకర్షణలోను ఏమాత్రం తగ్గేదేలేదంటున్న ఈ ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ సంగతేంటో తేల్చేద్దాం..

Woman Love with Phone Thief : తన ఫోన్ చోరీ చేసిన దొంగతో యువతి ప్రేమాయణం .. వీరి లవ్వు స్టోరీ మామూలుగా లేదుగా..

వేడుక ఏదైనా, ఆకర్షణీయమైన అలంకరణ కోరుకునేవారికి గులాబీలే గుర్తుకొస్తాయి. ఎన్నో ప్రత్యేకలుండే గులాబీలు ఒకటి రెండు రోజుల్లోనే వాడిపోతాయి. నలిగిపోతాయి. వాటికి భిన్నంగా.. ఎప్పటికీ వాడని ఆర్టిఫీషియల్‌ రోజ్‌ పెటల్స్‌ వేడుకల అలంకరణలో అగ్రతాంబూలం అందుకుంటున్నాయి.

నిజమైన పువ్వులను ఆర్టిఫీషియల్‌ పువ్వు (Artificial flowers) లెప్పుడూ పోటీ కావు. కానీ ఏది నిజమైందో, ఏది కృత్రిమమో తెలియనంత సహజంగా అందుబాటులోకి వస్తుండటంతో ఈ రేకులు అలంకరణపరంగా అద్భుతమనే చెప్పాలి. వాటిని పట్టుకుని చూస్తే తప్ప అవి ఆర్టిషిషియల్ అని తెలియనే తెలియవు. పైగా సువాన కూడా ఉండటంతో అవి నిజమైనవో ఆర్టిఫీషియల్ లో అర్థంకానంత నమ్మించేస్తాయి. వాటిని తొక్కినా నలిగిపోవు. దీంతో షూట్ లకు ఇవే కావాలంటున్నారు. వధువరులు వచ్చేప్పుడో, ప్రీ వెడ్డింగ్‌ షూట్లప్పుడో.. స్టిల్స్‌ కోసమో గులాబీ రేకుల్ని వాడతారు. అలాంటప్పుడు నిజమైన పువ్వుల్ని కొనటం ఖర్చుతో కూడినది. పైగా అవి వాడిపోకుండానే షూట్ కంప్లీట్ చేయాలి. అలాగే రేకుల్ని విడదీసి వినియోగించాలంటే మరీ త్వరగా వాడిపోతాయి.

T-Shirt : టీ షర్టుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..? ‘టీ’ అంటే ఏమిటీ

అలా డబ్బులు ఖర్చు అవ్వకుండా నలిగిపోతాయి. వాడిపోతాయి మచ్చలు పడతాయనే భయం ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఆర్టిఫీషియల్‌ గులాబీ రేకుల్ని చక్కగా వాడుకోవచ్చు. ఎరుపు, తెలుపు, పసుపు, నీలం.. ఇలా ఎన్నో రంగుల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వస్త్రంతో చేస్తారు. ఆకృతే కాదు, అందులోని గీతలూ నిజమైన గులాబీ రేకులను మరిపిస్తాయి. గులాబీల సువాసనను కూడా వెదజల్లేలా.. ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి రూపొందిస్తున్నారు. మళ్లీ మళ్లీ వాడుకునేందుకూ పనికొచ్చే ఈ వసివాడని గులాబీల సోకు పుష్ప ప్రియుల మనస్సులో దోచేసుకుంటున్నాయి.