దుబాయిలో పాకిస్థాన్ సింగర్‌తో సానియా.. ఫొటోలు వైరల్

Sania Mirza: సానియా మీర్జా చాలా సంతోషంగా ఈ ఫొటోల్లో కనపడుతుండడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

దుబాయిలో పాకిస్థాన్ సింగర్‌తో సానియా.. ఫొటోలు వైరల్

పాకిస్థాన్ గాయకుడు అతిఫ్ అస్లాం ఇటీవల దుబాయ్‌లో ఇచ్చిన లైవ్ కాన్సర్ట్‌కు భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సానియాతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జాతో కూడా దుబాయ్‌లో కనపడ్డారు.

ఆతిఫ్ అస్లాం, అతడి భార్య సారా భర్వణతో కలిసి సానియా మీర్జా లంచ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అలాగే, సానియా మీర్జా కూడా వాటిని షేర్ చేసింది. సానియా మీర్జా చాలా సంతోషంగా ఈ ఫొటోల్లో కనపడుతుండడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Sania Mirza Latest Insta Story Pics

సానియా మీర్జా కొన్ని నెలలుగా ఎన్నో వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటోంది. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమె ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. 2010లో షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. 2023లో అతడితో విడిపోయింది. షోయబ్ మాలిక్ ఈ ఏడాది జనవరిలో లాలీవుడ్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నానని ప్రకటించాడు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)