Up cop currency selfie : మంచం నిండా నోట్ల కట్టలు, కుటుంబంతో పోలీసు అధికారికి సెల్ఫీ.. ఆ తరువాత ఏమైందంటే..?
ఇంటినిండా నోట్ల కట్టలు. మంచం నిండా నోట్ల కట్టలు. వాటితో దిగిన సెల్ఫీ. ఓ పోలీసు అధికారికి చుక్కలు చూపెట్టింది.

Up cop currency selfie
Up cop currency selfie : అతనో పోలీసు అధికారి. భార్యాపిల్లలతో కలిసి తీసుకున్న సెల్ఫీతో చిక్కుల్లో పడ్డాడు. అందేంటీ భర్యా పిల్లలతో కలిసి సెల్ఫీ దిగితే చిక్కుల్లో పడటమేంటీ? అనుకుంటున్నారా? ఆ సెల్ఫో డబ్బుల నోట్ల కట్టలున్నాయి. ఓ మంచంపై కరెన్సీ నోట్ల కట్టలు పేర్చి భర్య పిల్లలతో కలిసి ఆ నోట్ల కట్టలన్నీ ఫోటోలో పడేలా సెల్పీ దిగాడు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఆయనగారికి చిక్కులు తెచ్చిపెట్టింది.అంత డబ్బు అతనికి ఎలా వచ్చింది?అంటూ ఎంక్వయిరీతో పాటు ట్రాన్స్ ఫర్ కూడ అయ్యింది.
Uttar Pradesh : పెళ్ళైన మరుసటిరోజే బిడ్డను ప్రసవించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఇటీవల ఈ సెల్ఫీ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ రమేశ్ చంద్ర సహానీ భార్యాపిల్లలు మంచంపై నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. రూ.500ల నోట్ల కట్టలతో మొత్తం రూ.14 లక్షల్ని మంచంపై పేర్చి భార్యాపిల్లలతో కలిసి సెల్ఫీ దిగారు రమేశ్ చంద్ర సహానీ. అంతడబ్బు సహానీకి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడితో ఊరుకోలేదు. సహానీని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు.
దీంతో దీంట్లో తాను ఏమీ తప్పుచేయలేదని వివరణ ఇచ్చుకున్నా ఫలితం దక్కలేదు. ఈ సెల్ఫో 2014లో తీసినదిని ఆ డబ్బు తన వారసత్వ ఆస్తిని అమ్మగా వచ్చినదని మీడియాకు తెలిపారు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అలా ఓ సెల్ఫీ అతని లైఫ్ లో చుక్కలు చూపించింది.