Alcohol in Glass Glasses : మద్యాన్ని గాజు గ్లాస్‌ల్లోనే పోసుకుని ఎందుకు తాగుతారు..? ఆసక్తికర కారణాలు..!

మద్యం తాగే ‘గ్లాసు’ వెరీ వెరీ ఇంపార్టెంట్. మద్యాన్ని స్టీలు, లేదా పింగాణి లాంటి వాటిల్లో తాగరు ఎందుకు? పర్టిక్యులర్ గా ‘గాజు గ్లాసు’ల్లో పోసుకుని తాగుతారు ఎందుకు..?

Alcohol in Glass Glasses : మద్యాన్ని గాజు గ్లాస్‌ల్లోనే పోసుకుని ఎందుకు తాగుతారు..? ఆసక్తికర కారణాలు..!

Alcohol in Glass Glasses

Alcohol in Glass Glasses : కళ్లముందు మద్యం బాటిల్ కనిపిస్తే చాలు మందు బాబులకు నోరూరిపోతుంది. ఓ గుటక అప్పటికప్పుడే వేసేద్దామనుకుంటారు. కానీ తాగాలని ఆరాటం ఎంత ఉన్నా..కొన్ని పద్ధతులు పాటిస్తారు. బాటిల్ మూత తీసే తీరు..దాన్ని గ్లాసులో పోసే తీరు దాంట్లో సోడానో లేదా ఐస్ ముక్కలు వేసే తీరు ఇలా అంతా పద్ధతి ప్రకారం చేసాకే గ్లాసు పైకెత్తి దాన్ని తనివితీరా కళ్లతో చూసుకుని ‘చీర్స్’ కొట్టుకుని గుటుకలేస్తు తాగుతారు. అలా మందు గొంతులో దిగుతున్న తీరును కూడా ఆస్వాదిస్తారు.

ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటీ అంటే మద్యం తాగే ‘గ్లాసు’ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. మద్యాన్ని స్టీలు, లేదా పింగాళి లాంటి వాటిల్లో తాగరు..ఎక్కువగా ఇంకా చెప్పాలంటే పర్టిక్యులర్ గా ‘గాజు గ్లాసు’ల్లో పోసుకుని తాగుతారు.అదే మాస్ మందుబాబులైతే డిస్పోజబుల్ గ్లాసుల్లో పోసుకుని తాగుతారు. అంటే పోసుకున్న మందు కంటికి కనిపించాలి. తాగేది ఎంత చీప్‌ లిక్కర్‌ అయినా కాస్ట్‌లీ స్కాచ్‌ అయినా సరే.. గాజు గ్లాసుల్లనే పోసుకుని తాగుతుంటారు ఎక్కువశాతం మంది. మరి మద్యానికి గాజు గ్లాసులనే వాడడానికి ఇష్టపడతారెందుకు.? ఎందుకు ఇంట్లో ఉన్న స్టీల్‌ గ్లాసో, లేదా పింగాళీ కప్పో వాడొచ్చు కదా..? ఎందుకు పర్టిక్యులర్ గా ‘గాజు గ్లాసు’లే ఎందుకు వాడతారు.. అంటే దీని వెనుకు ఉన్న కారణం ఏంటో.. తెలుసుకుందాం..

Karnataka Govt Excise Duty : మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన ప్రభుత్వం

గ్లాస్‌తో తయారు చేసిన వస్తువులు, ద్రవాలు, ఆహారాలను చూస్తే నోరూరేలా కనిపిస్తాయి. అందులో వేసిన ఆహారాలతో ఎలాంటి రసాయనా సంబంధాలను కలిగి ఉండదు. అలాగే రుచి, పదార్థాల వాసన చెక్కుచెదరకుండా ఉంటాయి. అదే ఏ ఇతతర రకాల గ్లాసులు వాటిలో వేసిన ఆహారంతో అవాంచిత రసాయనాల విడుదల అవుతాయి. రుచిని కూడా మారొచ్చు కూడా. అందుకే ఎక్కువగా గాజు గ్లాసుని ఆల్కహాల్ తాగడానికి వాడతారు. ఈ గ్లాసు పారదర్శకంగా ఉంటుంది. అందులో వేసిన ఆల్కహాల్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మద్యం క్వాంటిటీ క్లియర్ గా కనిపిస్తుంది. నోరూరిస్తుంది. దీంతో ఇంకా తాగాలనిపించేలా ఉంటుంది.

ఎందుకంటే ఆహారానికి విజువల్ అప్పీల్ వెరీ ఇంపార్టెంట్. అందుకే స్టార్ హోటల్స్ లో ఆహారాలు మన సాధారణంగా ఇంట్లో చేసుకునేవాటికంటే ఎక్కువ రుచిగా ఏమీ ఉండవు. కానీ అక్కడ ఆహారాలకు ప్రెజెంటేషన్ ముఖ్యంగా పాటిస్తారు. అంటే డెకరేషన్ గా సర్వ్ చేస్తారు. క్యారెట్, టమాటా, నిమ్మ చెక్క వంటివాటితో అందంగా అలంకరించి సర్వ్ చేస్తారు. అలా డెకరేషన్ చేస్తేనే కలర్ ఫుల్ గా కనిపించి తినాలనిపించేలా ఉంటుంది. పైగా ఇది క్లాస్ గా కనిపిస్తుంది. మన ఇళ్లల్లో అయినా కూల్ డ్రింక్ తాగటానికి గాజు గ్లాసే ఉపయోగిస్తాం. స్టీల్ గ్లాసులో పోసుకుని తాగాలని అనిపించదు. కలర్ చక్కగా కనిపించి తాగాలనిపించేలా ఉంటుంది.పైగా అందంగా కనిపిస్తుంది. దాన్ని చూస్తే ఓ రకమైన కిక్ వస్తుంది. తాగుతున్న హ్యాపీనెస్ దాన్ని చూస్తేనే కలిగేలా ఉంటుంది.

Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?

కాబట్టి తినే ఆహారమైనా..తాగే మద్యం, కూల్ డ్రింక్ అయినా గాజు గ్లాసులో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాషాయం రంగులో ఉండే విస్కీ అయిన, క్రిస్టల్ క్లియర్‌గా కనిపించే వోడ్కా అయినా గాజు గ్లాసులో తమ రూపాన్ని, రంగును ఏమాత్రం మార్చుకోకుండా అలానే ఆకట్టుకునేలా చక్కగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువమంది గాజు గ్లాసులోనే ఆల్కహాల్, పానీయాలను తాగేందుకు ఇష్టపడతారు.

అంతేకాదు దీనికి మరో ముఖ్యమైన కారణమేమంటే..గాజు గ్లాసులో వేసిన ఆల్కహాల్ ఉష్ణోగ్రత మార్పులను తట్టుకుంటుంది. రూమ్ టెంపరేచర్ కు త్వరగా చేరుకోదు. కూలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. గాజు గ్లాసు రూమ్ టెంపరేచర్ లో ఉన్న వేడిని ఆల్కహాల్‌కు చేరకుండా అడ్డుకుంటుంది. అందుకే ఆల్కహాల్ అమ్మకాలు కూడా గాజు సీసాల్లోనే ఉంటాయి. గ్లాస్ ఎక్కువ కాలం మన్నుతుంది కూడా (భద్రంగా చూసుకుంటే అంటే పగిలిపోకుండా). గాజు వస్తువులు ఎంతకాలమైన వాడుకోవచ్చు. అదే స్టీల్, అల్యూమినియం వస్తువులు, ప్లాస్టిక్ వంటివి ఎక్కువకాలం వాడకూడదని నిపుణులు చెబుతుంటారు.

Haryana : డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న డైనమిక్ లేడీ… ఎవరంటే..

ఎక్కువ కాలం పాటు ఉపయోగించినా కూడా త్వరగా శుభ్రపరచాల్సిన అవసరం కూడా ఉండదు. వాటి లోపల వ్యర్ధాలు ఏమన్నా ఉంటే క్లిస్టర్ క్లియర్‌గా కనిపిస్తాయి. గాజు అనేది నాన్ పోరస్. అంటే బయటి వాసన, రుచి, బ్యాక్టీరియా వంటి వాటిని త్వరగా గ్రహించదు. పానీయాలు కాలుష్యం కాకుండా చూస్తుంది. అందులో త్వరగా చేరకుండా రక్షణ కల్పిస్తుంది. అందుకే ఆల్కహాల్ ఎల్లప్పుడు గాజు వస్తువుల్లోనే భద్రపరుస్తారు. తాగేటప్పుడు కూడా గాజు గ్లాసులోనే తాగుతారు. మరి ఇప్పుడు తెలిసిదే మద్యం తాగటానికి ‘గాజు గ్లాసు’లే ఎందుకు వాడతారో..