Abraj Kudai : ప్రపంచంలోనే అత్యంత పెద్ద హోటల్ .. ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
‘అబ్రాజ్ కుడాయి’..లగ్జరీలకే లగ్జరీ ఈ హోటల్ అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. ఏడారి దేశంలో అద్భుత సౌథం.

World Largest Hotel Abraj Kudai
World Largest Hotel Abraj Kudai : సౌదీ అరేబియాలోని ఇస్లామీయుల పవిత్ర నగరం మక్కాలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద హోటల్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే పెద్దది అంటే ప్రత్యేతలకు ఏమాత్రం లోటు ఉండదనే విషయం తెలిసిందే. మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్న ఈ హోటల్‌కు పేరు ‘అబ్రాజ్ కుడాయి’..లగ్జరీలకే లగ్జరీ ఈ హోటల్ అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.
1.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ హోటల్‌లో మొత్తం 12 టవర్లు ఉంటాయి. 70 రెస్టారెంట్లు. 10 వేల రూమ్‌లు. హోటల్ భవనం నాలుగు టవర్లపై నాలుగు హెలిప్యాడ్‌లు. ఒక టవర్‌లో 45 ఫ్లోర్లు. 30 ఫ్లోర్లతో మరో టవర్ నిర్మాణం. ఇలా చెప్పుకుంటు పోతే ఈ అబ్రాజ్ కుడాయ్ ప్రత్యేకలు మామూలుగా లేవు. 11 టవర్లలో 30 నుంచి 40 ఫ్లోర్లు ఉండగా ఒక టవర్ లో మాత్రం 45 ఫోర్లు నిర్మిస్తున్నారు. ఒకేసారి 30,000లమందికి అతిథ్యం ఇచ్చే సౌకర్యాలు ఈ ‘అబ్రాజ్ కుడాయి’ ప్రత్యేకత.
ఈ హోటల్ నిర్మాణానికి మొత్తం 233 బిలియన్ రూపాయాలు ఖర్చు అంచనా కాగా మరింత పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో ఐదు ఫ్లోర్లు కేవలం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీకి మాత్రమే కేటాయించనున్నారు. సామాన్య జనం ఈ ఫ్లోర్లలోకి వెళ్లేందుకు ఎటువంటి అనుమతి ఉండదు. అత్యంత ఎత్తైన, ఖరీదైన హోటల్ నిర్మాణాన్ని దార్ అల్ హంద్‌షా గ్రూప్ రూపకల్పన చేసింది. ఈ హోటల్ నిర్మాణం 2017లోనే పూర్తి అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాన పనులు ఆపేయగా ఈ హోటల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.