Most Expensive Coffee : పిల్లుల మలంతో చేసే కాఫీ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేస్టీ కాఫీ

పిల్లుల మలంతో తయారు చేసే ఓ రకం కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా టేస్టీ టేస్టీ కాఫీగా పేరొందింది.

Most Expensive Coffee : పిల్లుల మలంతో చేసే కాఫీ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేస్టీ కాఫీ

Most Expensive Coffee..Civet Cat Coffee

Most Expensive Coffee..Civet Cat Coffee : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది తాగేది టీ అయినా కాఫీకి ఉండే ఆ టేస్టే వేరు. చిక్కటి పాలల్లో కాఫీ పొడి వేసుకుని చక్కగా మరిగించి తాగితే ఉంటదీ..అటువంటి ఓ కప్పు కాఫీ గొంతులోకి దిగుతుంటే  అమృతమే తాగుతున్నట్లుగా ఉంటుంది. టీలో ఉన్నన్ని రకాలు కాఫీలో ఉండవు. కానీ కాఫీకి ఉండే రేంజే వేరు. అటువంటి ఓ ప్రత్యేకమైన కాఫీ గురించి చెప్పుకోవాలి. ఇది అలాంటిలాంటి కాఫీ కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ. కానీ ఈ కాఫీ తయారు చేసేది దేంతోనో తెలిస్తే మాత్రం వాక్ అంటూ వాంతి చేసుకుంటారు.

ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా టేస్టీ టేస్టీ కాఫీగా పేరొందిన ఈ కాఫీని ఓ పిల్లుల మలంతో తయారు చేస్తారు..పిల్లి జాతికి చెందిన ఓ జంతువు మలంలో లభ్యమయ్యే కాఫీ గింజలతో ఈ కాఫీని తయారు చేస్తారు. ఆ గింజలతో తయారు చేసిన కాఫీని ఒక్కసారి టేస్ట్ చేస్తే..వారెవ్వా అమృతం కూడా దీని రుచి ముందు పనిచేయదంటారట..దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత టేస్టీ కాఫీగానే కాదు అత్యంత ఖరీదైన కాఫీగా పేరొందింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ వినూత్న కాఫీని సివెట్ పిల్లుల (Most Expensive Coffee)మలం నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు. సివెట్ అనే పిల్లి జాతి జంతువు కాఫీ గింజల్ని తింటుంది. అలా తిన్న తరువాత వాటి కడుపులో జీర్ణయం అయ్యా మాత్రమే ఈ కాఫీ గింజలకు అద్భుతమైన రుచి పెరుగుతుందట. టేస్ట్ పెరుగుతుందట. ఇండోనేషియాలో పిల్లి తిని మలంతో పాటు విసర్జించిన కాఫీ గింజల్ని సేకరించే గింజల కాఫీకి మంచి క్రేజ్ ఏర్పడింది. సివెట్ అనే పిల్లి జాతికి చెందిన జంతువు మలంలో లభ్యమయ్యే ఈ కాఫీ గింజలను అద్భుతమైన రుచి ఉంటుందని ఇండోనేషియాలో 19వ శతాబ్దంలోనే కనుగొన్నారట. ఇలా సేకరించిన గింజలు ఎంత ఖరీదు అంటే ఒక్క పౌండ్ బరువుండే గింజలు యూఎస్ డాలర్ల రేటుకు అమ్ముడవుతుంటాయి.

COVID-19 : కరోనా చికిత్స తరువాత నీలిరంగులోకి మారిన పసిబిడ్డ కళ్లు

ఇంత పాపులర్ అయినా ఈ కాఫీని పిల్లి విసర్జించిన గింజలతో తయారవుతుందంటే నమ్మలేం కానీ ఇది నిజం. కానీ ఆ కాఫీ కోసం ఉవ్విళ్లూరే వారు బోలెడంత మంది ఉన్నారు. అందుకే అత్యంత ఖరీదైన కాఫీగా(Worlds most expensive Coffee) అది రికార్డు సొంతం చేసుకుంది. ఇండోనేషియాలో దీన్ని కోపి లువాల్(Kopi luwak) లేదా సివెట్ క్యాట్ కాఫీ(Civet Cat Coffee) అంటారు.

సివెట్‌ అనేది పిల్లి జాతికి చెందిన ఓ క్షీరదం. దీన్ని తెలుగులో పునుగు పిల్లి అని అంటారు. ఇక ఇండోనేషియా(Indonesia), సుమత్రా(Sumatra), జావా(Java), బాలి(Bali)లో కోపి లువాక్ (Kopi Luak)అనే ఓ రకమైన కాఫీ చెర్రీలను పెంచుతారు. ఇవి చాలా చేదుగా ఉంటాయి. వీటిని డైరెక్ట్ గా కాఫీకి వినియోగిస్తే చేదు కషాయంలా ఉంటుందట కాఫీ. కానీ అవే గింజల్ని పునుగు పిల్లి తిని విసర్జించిన తరువాత ఆ గింజలకు అద్భుతమైన రుచి వస్తుందట.

అత్యంత చేదుగా ఉండే ఆ కాపీ చెర్రీలను పునుగు పిల్లి ఆహారంగా తింటుంది. పునుపు పిల్లికి ఈ చెర్రీలంటే మహా ఇష్టం. అందుకే వాటిని తెగ తినేస్తుంది. ఆహారం తిన్నాక అది విసర్జించే కాఫీ గింజలు అద్భుతమైన రుచి సంతరించుకుంటాయి. పునుగు పిల్లి జీర్ణాశయంలోని ఎంజైములే దీనికి కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఎంజైములు కాఫీ గింజల్లోకి చొచ్చుకెళ్లి వాటి రసాయనిక స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గింజలను జీర్ణం చేసే క్రమంలో వాటికి కొత్త రుచిని జోడించి బయటకు వస్తాయి.

Louisiana : తప్పిపోయిన 100 ఏళ్ల తాబేలు మళ్లీ ఫ్యామిలీని కలిసింది.. ఎలా అంటే?

ఇక పిల్లి విసర్జించిన మలంలో గింజలను కాఫీ గింజల్ని వేరు చేసి వాటిని బాగా శుభ్రం చేస్తారు. అలా సేకరించి శుభ్రపరిచి వాటితో కాఫీ తయారు చేస్తారు. ఈ కాఫీ తయారీకి పునుగు పిల్లులు కీలకం కావడంతో ఈ కాఫీ గింజలకు యమా డిమాండ్ ఉంటుంది. ధర ఆకాశాన్ని అంటింది. ఈ పిల్లులను బోనుల్లో బంధించి వాటికి ఆ కాఫీ చెర్రీలను ఆహారంగా వేస్తారు. వాటి మలాన్ని సేకరించి శుభ్రం చేస్తారు. కాఫీ తయారీదారులు ఈ పునుగు పిల్లుల్ని బంధించి మరీ మలాన్ని సేకరించటంతో జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

కాగా భారత్ లో పునుగు పిల్లులు అంతరించిపోయే జాతిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. పునుగు పిల్లి అంటే తిరుమల కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. ఎందుకంటే పునుగు పిల్లి నుంచి సేకరించిన తైలాన్ని శ్రీవారికి పూస్తారు. పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరచి స్వామి వారికి ప్రత్యేకంగా అలంకారంగా పూస్తారు.