KJQ Movie Review : KJQ (కింగ్ – జాకీ – క్వీన్) మూవీ రివ్యూ.. డైరెక్టర్ మరణించాక రిలీజ్ అయిన సినిమా..
KJQ Movie Review : గతంలో నాగార్జునతో కేడి సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు కేకే చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేసాడు.
కథ విషయానికొస్తే..
పార్థ(దీక్షిత్ శెట్టి) ఓ అనాథ. అందరూ తనని చిన్నచూపు చూడటంతో సమాజం మీద ద్వేషం ఏర్పడి ఎలాగైనా బాగా సంపాదించాలి, సిటీని రూల్ చేయాలని తనకు ఎదురు వచ్చిన వాళ్ళందర్నీ తొక్కుకుంటూ పెద్ద రౌడీగా ఎదుగుతాడు. చివరకి సిటీని రూల్ చేసే కమల్ దాస్ కూతురు(రేఖ నిరోషా)ని పెళ్లి చేసుకొని సిటీని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. తను చంపాలనుకున్న SI ని జాకీ చంపడంతో అనాథగా మారిన జాకీ(శశి ఓదెల)ని చేరదీసి తమ్ముడిగా పక్కనే పెట్టుకుంటాడు పార్థ. ఓ రోజు సినిమా హీరోయిన్ భార్గవి(యుక్తి తరేజా)ని తన పార్టీలో డ్యాన్స్ చేయమని అడిగితే నో చెప్తుంది. దాంతో పార్థ అహం దెబ్బ తిని భార్గవిని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. భర్త ఇంకో అమ్మాయి వెనక తిరుగుతున్నాడని పార్థ భార్య జాకీని హెల్ప్ చేయమని అడుగుతుంది. అదే సమయంలో జాకీ - భార్గవి ముద్దు పెట్టుకున్న ఫోటో లీక్ అవుతుంది. దీంతో అన్నదమ్ములుగా ఉన్న జాకీ - పార్థ మధ్య ఎలాంటి సంఘటనలు నెలకొంటాయి? దీనికి కారణమైన హీరోయిన్ భార్గవి ఎవరు? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? పార్థ ఎలా ఎదిగాడు? అసలు పార్థ, జాకీలు ఎలా అనాథలుగా మారారు.. అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also Read : Korean Kanakaraju Review : ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా.. హిట్ కొట్టాడా మరి?సినిమా విశ్లేషణ..
గతంలో నాగార్జునతో కేడి సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు కేకే చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేసాడు. అయితే సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఉన్నప్పుడు కేకే అనారోగ్య సమస్యలతో మరణించడంతో సినిమా ఆలస్యంగా రిలీజ్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా మూడు పాత్రల పరిచయాలు, పార్థ - జాకీ ఎలా ఎదిగారు, జాకీ ప్రేమ కథ, పార్థ, జాకీ చేసే దందాలు, పార్థ పెళ్లి సీన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఎంట్రీ, పార్థ అహం దెబ్బ తినడం, జాకీ - హీరోయిన్ ముద్దు ఫోటో బయటకు రావడంతో మంచి బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. చివర్లో హీరోయిన్ కోసం పార్థ - జాకీల మధ్య ఏం జరిగింది? పార్థ జీవితం ఏమైంది అని సాగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసారు. ఓ అనాథ ఎవరూ పట్టించుకోకపోతే ఎలా ఎదిగాడు అని గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది. అలా ఎదిగిన వ్యక్తి అహంతో ఉంటే ఎలా మారాడు, తన లైఫ్ లో ఏం పోగొట్టుకున్నాడు, మనిషిని అహం ఎలా నాశనం చేస్తుంది అనే మెసేజ్ తో ముగించారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ అందరి ఫ్లాష్ బ్యాక్స్ రొటీన్ కథలే. చాలా సినిమాల్లో చూసేసినవే. అందరి ఫ్లాష్ బ్యాక్స్ కథ నడుస్తున్నప్పుడే ఊహించేయొచ్చు. బోల్డ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కొంత వర్కౌట్ అయ్యాయి.
