Volunteers Resign : 22మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా.. కారణం ఏంటంటే..

నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

Volunteers Resign : 22మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా.. కారణం ఏంటంటే..

Volunteers Resign : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పోస్టులకు వారు రాజీనామా చేశారు. ఏకంగా 22 మంది వాలంటీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 39 వార్డులో మొత్తం 22మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. విధుల్లో అడుగడుగునా టీడీపీ, జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని వాలంటీర్లు ఆరోపించారు. ఈ క్రమంలో 22మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసేశారు.

నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతాం అంటూ వాలంటీర్లు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి రాజీనామా విషయం తెలిపిన వాలంటీర్లు.. ఎన్నికల్లో మద్దతు పలికారు.

”సీఎం జగన్.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి మంచి జరగాలని చూస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వాలంటీర్లు అనితరమైన సేవలు అందిస్తున్నారు. తెల్లవారుజామునే 5 గంటలకే ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నా, వేరే ఊరిలో ఉన్నా.. వాలంటీర్లు స్వయంగా వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు సేవా భావంతో పని చేస్తున్నారు. అలాంటి వారి గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. దారుణంగా మాట్లాడారు. దుర్మార్గానికి ఒడిగట్టారు.

చంద్రబాబుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ రమేశ్, వర్ల రామయ్య.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం, హైకోర్టుకు వెళ్లడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసివేయాలని కుట్రల చేశారు. వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని, మగవాళ్లు లేని సమయంలో మహిళలతో మాట్లాడుతున్నారని.. నిందలు వేశారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను మర్చిపోయిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కల్యాణ్. 1వ తేదీన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, పేదల ఆశలపై చంద్రబాబు గొడ్డలి వేటు వేశారు వర్ల రామయ్య ద్వారా.

ఎందుకు అవ్వా తాతలు, చదువుకునే పిల్లలు, రైతన్నలు, అక్క చెల్లెమ్మల, సొంతిల్లు కట్టుకోవాలనుకునే పేదల మీద.. మీకు ఎందుకింత కక్ష? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చారా? వాలంటీర్లు ద్వారా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపై కక్ష కడతారా? వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోర్టుకి వెళ్లడం అంటే.. వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందే సాయాన్ని అడ్డుకోవడమే. ఇటువంటి దారుణమైన చర్యను ప్రతొక్కరూ ఖండించాలి” అని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు.

Also Read : అక్కడ వైసీపీ సీనియర్‌ను ఓడించేందుకు చంద్రబాబు సరికొత్త ప్రయోగం..!