శాడిస్టు ప్రభుత్వం : పవన్‌ను టీడీపీ దత్తపుత్రుడు అంటారా – అచ్చెన్నాయుడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను ఫెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖపట్టణంలోని మద్దిలపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనికి టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభలో అచ్చెన్న నాయుడు పాల్గొని ప్రసంగించారు.
ఇసుక కొరతపై ఐదు మాసాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు చీమ కుట్టినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతపై కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే..సామాజిక మరణాలు అంటారా ? అని వైసీపీ మంత్రిని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ దత్తపుత్రుడు అంటారా ?..వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆక్రందన చూసి..చలించకపోతే..ప్రజా తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు బాబు, టీడీపీ పార్టీ జనసేనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా..ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా పార్టీలు వ్యవహరించాలని సూచించారు.
Read More : లాంగ్ మార్చ్ : జనసేన చేసే పోరాటాలకు సపోర్టు – టీడీపీ