వైసీపీలో వలసలు: జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆదాల, వంగా గీత

  • Published By: vamsi ,Published On : March 16, 2019 / 02:10 PM IST
వైసీపీలో వలసలు: జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆదాల, వంగా గీత

Updated On : March 16, 2019 / 2:10 PM IST

నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం ఫస్ట్ ‌లిస్ట్‌లో చోటు దక్కినప్పటికీ వైసీపీ గూటికి చేరారు.  హైదరాబాద్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీలోకి చేరారు. నెల్లూరులో సిట్టింగ్ ఎంపీ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని తప్పించి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఆదాల చేరికతో జిల్లాలో తెలుగుదేశంకు బలం తగ్గినట్లుగా అయింది.
Read Also : టీడీపీ రెండవ జాబితా: పార్లమెంటు అభ్యర్ధులు వీళ్లే!
 
అలాగే కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా వంగ గీత పేరును వైసీపీ ఖరారు చేసింది. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన గీత.. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇవాళ(16మార్చి 2019) జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాకినాడలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన గీతను ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారు. ప్రస్తుత కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కూడా వైసీపీలో ఉండడంతో గీత గెలుపు సులువువతుందని భావిస్తున్నారు.