పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదు…చంద్రబాబుది దొంగ దీక్ష

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు. 

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 07:37 AM IST
పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదు…చంద్రబాబుది దొంగ దీక్ష

Updated On : November 15, 2019 / 7:37 AM IST

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు. 

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తాము కూడా వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. శుక్రవారం (నవంబర్ 15, 2019) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. జగన్ ను విమర్శించేందుకు ఎవరు మీకు డబ్బులు ఇస్తున్నారని పవన్ ను ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారంటే ఎక్కడి నుంచో మీకు ప్యాకేజీలు అందుతున్నాయని ఆరోపించారు. మీ గురించి జనసేన కార్యర్తలు, నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. పవన్ కు ఇంకిత జ్ఞానం ఉండదు..కానీ తమకు మాత్రం ఉండాలంటూ, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

జగన్ ను చూసి ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని పవన్ మాట్లాడుతున్నారని..ఓడిపోతే పరిస్థితి ఏంటని అంటున్నారని…అటైనా, ఇటైనా, ఎటైనా జగన్ వెంటనే ఉండే వ్యక్తులమన్నారు. మీరు అధికారంలో లేకపోయే సరికి మీ వెనుకాల ఉన్న జనం జారి పోతున్నారని తెలిపారు. తమ గురించి మాట్లాడే నైతిక విలువలు చంద్రబాబు, పవన్ కు లేవని చెప్పారు. తెనాలి బాబు, లింగమనేని బాబు కలిసి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లి ప్యాకేజీలు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినవారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే నాశనం చేసుకున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. సొంతంగా పార్టీని నడుపుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇసుక, ఇంగ్లీష్ మీడియంపై తప్ప వేరే మాట్లాడటం లేదన్నారు.

చంద్రబాబు ఇసుక దీక్షపై అంబటి విమర్శలు చేశారు. ఇసుక కొరతపై చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు. దీక్షల పేరుతో బాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుందన్నారు. తండ్రీకొడుకులిద్దరూ అధర్మంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 22 క్లైమోర్ మైన్స్ కు భయపడలేదు కానీ కేసీఆర్ ఒక్క మాటంటే పారిపోయివచ్చేశారంటే చంద్రబాబు ధైర్యం ఎంటో అర్థం అవుతుందన్నారు. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండే హక్కు కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం కల్పిస్తే.. ఒక్క కేక వేస్తే అమరావతిలో వచ్చి పడ్డారని ఎద్దేవా చేశారు. అమరావతిలో చేసిన ఘోరాలు, క్రూరాలు బయటికి వస్తాయని అన్నారు.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తప్పేంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకవైపు పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ తెలుగు మీడియం కోసం పోరాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దానిపై గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇసుక కృత్రిమ కొరత కాదని…సహజంగా వచ్చిన కొరత అన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామనడం అవాస్తం అన్నారు. ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలని పవన్, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని.. అది ధర్మం కాదన్నారు.