Amit Shah : ఆ మూడు.. కుటుంబ పార్టీలు అంటూ నిప్పులు చెరిగిన అమిత్ షా

తెలంగాణలో మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా.

Amit Shah : ఆ మూడు.. కుటుంబ పార్టీలు అంటూ నిప్పులు చెరిగిన అమిత్ షా

Amit Shah

Amit Shah : బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు అని కానీ, బీజేపీ మాత్రం ప్రజల పార్టీ అని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎంఐఎం అజెండాను ముందుకు తీసుకెళ్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా. బీఆర్ఎస్ అవినీతి చిట్టా అంతా తమ దగ్గర ఉందన్నారు అమిత్ షా.

”కాంగ్రెస్ పార్టీలో నాలుగు తరాల నుంచి నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఇక్కడ బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్.. మజ్లిస్ లో కూడా నాలుగు తరాలు వచ్చాయి. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే. ఇంకా ఎన్ని వస్తాయో తెలీదు. ఈ కుటుంబ పార్టీల ద్వారా తెలంగాణ బాగుపడదు” అని అమిత్ షా ధ్వజమెత్తారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు- బండి సంజయ్
”మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో నీతి నిజాయితీ ఉంటే.. 17కి 17 లోక్ స్థానాలు బీజేపీ గెలిస్తే.. నరేంద్ర మోదీ మనకు అదనపు నిధులు ఇస్తారు. మేము కొట్లాడి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. బీఆర్ఎస్ పార్టీ దయనీయం. కేసీఆర్ పెద్ద డ్రామా ఆడారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నన్ను వచ్చి కలిశారు” అని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బండి సంజయ్ అన్నారు.

”అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని ఖాతరు చేయొద్దు. ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోదీకి మద్దతుగా తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించుకుందాం” అని కిషన్ రెడ్డి అన్నారు.