కోడికత్తి కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

కేసుల్లో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేనపుడు బెయిల్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సస్ ముజీబ్ కేసులో తీర్పు ఇచ్చిందని నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది పాలేటి మహేష్ తెలిపారు.

కోడికత్తి కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Kodi Kathi Case Judgement Reserved

Updated On : January 24, 2024 / 6:20 PM IST

Kodi Kathi Case : కోడికత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితుడి తరపున న్యాయవాది పాలేటి మహేష్ వాదనలు వినిపించారు. NIA తరపున అదనపు సొలిసిటరల్ జనరల్ వాదనలు వినిపించారు.

విచారణ జరగకుండా జగన్ అడ్డుపడుతున్నారని కోర్టుకు తెలిపారు NIA తరపు న్యాయవాది. 2019లో కేసు ఛార్జిషీట్ వేస్తే 2023లో లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. 2019లో ఛార్జిషీట్ ధాఖలు చేస్తే లోతు దర్యాప్తు కోరడం కోసం 2023 దాకా ఎందుకు సమయం పట్టిందని హైకోర్టు ప్రశ్నించింది. దాన్ని మేము వ్యతిరేకించామని NIA తరపు న్యాయవాది తెలిపారు.

కోర్టుకు హాజరుకాకుండా పిటిషన్స్ వేస్తూ జగన్ కాలయాపన చేస్తున్నారని NIA న్యాయవాది చెప్పారు. అడ్వకేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు NIA తరపు న్యాయవాది. అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రొవిజన్ ఎక్కడుందని హైకోర్టు అడిగింది. జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని NIA తరపు న్యాయవాది చెప్పారు.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

కేసుల్లో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేనపుడు బెయిల్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సస్ ముజీబ్ కేసులో తీర్పు ఇచ్చిందని నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది పాలేటి మహేష్ తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును హరించడమేనని కోర్టుకు వెల్లడించారు. కోడికత్తితో దాడిలో జగన్ కు అయిన గాయం చాలా చిన్నదే అని తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది.

సెక్షన్ 3A ప్రకారం చిన్నపాటి గాయమే.. తీవ్రగాయం లేదు. ప్రాణాపాయం కలగలేదు అని పిటిషనర్ తరపు న్యాయవాది పాలేటి మహేష్ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

ఏపీలో సంచలనం రేపిన కోడికత్తి కేసులో ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైల్లోనే ఉన్నాడు. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్నాడు. వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడు శీను జైల్లో మగ్గుతున్నాడు. శీనుకు బెయిల్ కోసం కుటుంబసభ్యులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలని శీను కుటుంబసభ్యులు నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి ఉంది. నిందితుడు శీను బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదోపవాదాలు పూర్తయ్యాయి. నిందితుడికి బెయిల్ ఇవ్వాలని కొందరు న్యాయవాదులు సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసర కేసు కింద పరిగణించాలని కోరారు. ఇప్పటికే దాదాపు ఐదేళ్లుగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడు. నిందితుడు పడుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని హైకోర్టును ఆశ్రయించారు.