డేటా చోరీ: టీడీపీ, వైసీపీలు డ్రామాలు చేస్తున్నాయి

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 01:01 PM IST
డేటా చోరీ: టీడీపీ, వైసీపీలు డ్రామాలు చేస్తున్నాయి

Updated On : March 6, 2019 / 1:01 PM IST

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు డేటా చోరీ విషయంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ కన్నా ప్రశ్నించారు. డేటా చోరీ వ్యవహారంలో ఏపీలో టీడీపీ, వైసీపీలు డ్రామాలు చేస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. డేటా చోరీ అంశంపై నిజాలు తెలియాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారంటూ కన్నా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని, ఏదైనా చిన్న కేసు వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహా అందరూ మాట్లాడుతున్నారంటూ ఆయన వివరించారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు స్పష్టంగా తెలియజేసినట్లు తెలిపారు.