చంద్రబాబు సెటైర్: ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. కరెంట్ ఢిల్లీలో

ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 11:36 AM IST
చంద్రబాబు సెటైర్: ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. కరెంట్ ఢిల్లీలో

Updated On : March 20, 2019 / 11:36 AM IST

ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర

ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్ లో.. కరెంట్ ఢిల్లీలో అంటూ.. జగన్, కేసీఆర్, మోడీలను ఉద్దేశించి విమర్శించారు. జగన్ కు తెలంగాణ పోలీసులు వద్దు.. ఏపీ పోలీసులు ముద్దు అని అన్నారు. నేను అమరావతిలో ఉంటే.. జగన్ లోటస్ పాండ్ లో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జగన్ కి ఒక్కసారి ఓటు వేస్తే.. మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. మీరు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదన్నారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.
Read Also : మాచర్ల టికెట్ రగడ : సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలపైనా చంద్రబాబు మండిపడ్డారు. తనను దెబ్బకొట్టేందుకు ఆ ఇద్దరు జగన్ తో చేతులు కలిపారని ఆరోపించారు. కేసీఆర్ మన ఆస్తులు మనకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఏపీకి నమ్మకద్రోహం చేసిందని.. విభజన హామీలు నెరవేర్చలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల గురించి మాట్లాడితే.. కేంద్ర సంస్థలతో మనపై దాడులు చేయిస్తున్నారని చెప్పారు.

ఐదేళ్లు సుపరిపాలన ఇచ్చామని చంద్రబాబు అన్నారు. పేదల కష్టాలు చూసి ఫించన్లు 10 రెట్లు పెంచామన్నారు. అమరావతిని ప్రపంచపటంలో పెడతానని.. ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే