రాష్ట్రాల్లో పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ : సీఎం చంద్రబాబు 

ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 06:57 AM IST
రాష్ట్రాల్లో పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ : సీఎం చంద్రబాబు 

ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతి : రాష్ట్రాల్లో పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, యునైటెడ్ ఇండియా పేరుతో ఒకే వేదిక ఉంటుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్, టీఎంసీలు పొత్తు పెట్టుకోలేదని.. అయినా కోల్ కతా ర్యాలీకి కాంగ్రెస్ నేతలు వచ్చారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. నిరంకుశ పాలన అంతమే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పేర్కొన్నారు. దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి ఎజెండా అని అన్నారు. 

కాపులకు రిజర్వేషన్లపై వైసీపీ, బీజేపీ అవాకులు చెవాకులు చేస్తున్నారని తెలిపారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే వారికి బాధేంటని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై రాష్ట్రానికి అధికారం లేదంటున్నారని..రాజకీయ లబ్ధే వైసీపీ, బీజేపీ ఉమ్మడి ఎజెండా అని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదన్న జగన్..ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.