వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు

స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు

YCP Rebel MLAS

Updated On : January 29, 2024 / 9:33 PM IST

YCP Rebel MLAS : వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకోలేము అని చెప్పింది కోర్టు. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.

Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం

వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య.. ఎందుకు మీపైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోకూడదు, మీ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదో చెప్పాలంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ వారందరికి నోటీసులు పంపారు. గతంలో రెండుసార్లు వీరికి నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఇప్పుడు మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో వారంతా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

అయితే, రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓటు వేసే అవకాశం లేకుండా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చేస్తారన్న ఆందోళనలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులను వారు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ పై కోర్టు విచారించింది. నోటీసులపై తమ వాదనలు వినిపించేందుకు లేదా వివరణ ఇవ్వడానికి స్పీకర్ ను గడువు కోరామని, అయితే గడువు ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని, నెల రోజుల సమయం ఇవ్వాలని తాము స్పీకర్ ను కోరామని రెబల్ ఎమ్మెల్యేలు కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇప్పటికిప్పడు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం లేనందున.. తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది.