టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన నేతలకు బ్యాడ్ న్యూస్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 02:30 PM IST
టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన నేతలకు బ్యాడ్ న్యూస్

Updated On : September 26, 2019 / 2:30 PM IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. అలా టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన నాయకులకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బ్యాడ్ న్యూస్ వినిపించారు. టీడీపీ వాళ్లు బీజేపీలో చేరినంత మాత్రాన వారి కేసులు మాఫీ కావు అని స్పష్టం చేశారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు, నేతలపై ఉన్న కేసులు ఏవీ మాఫీ కావన్నారు. వారిపై ఉన్న కేసులకు వారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ అవినీతికి ఎప్పుడూ వ్యతిరేకమే అని జీవీఎల్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వస్తున్నారని వివరించారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు బీజేపీ భావజాలంతోనే పని చేయాలన్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంతో బీజేపీకి రాజకీయ అనుబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. తప్పు చేస్తే జగన్ సర్కార్ ని నిలదీస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతికి సంబంధించి ఆధారాలు ఉంటే జగన్ ప్రభుత్వం చూపించాలన్న జీవీఎల్.. రాజకీయ ఆరోపణలను ప్రోత్సహించేది లేదన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారిస్తుందని.. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జీవీఎల్ వెల్లడించారు. 

బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని, దేశాభివృద్ధికి తోడ్పడిందని జీవీఎల్ చెప్పారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని.. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ రివర్స్ టెండర్ల అంశంపైనా జీవీఎల్ స్పందించారు. రివర్స్ టెండర్లతో ప్రభుత్వం డబ్బు ఆదా చేస్తే ఆహ్వానించదగ్గ విషయమే అన్నారు. ప్రాజెక్ట్ ఖర్చు తగ్గించి నిర్మిస్తామంటే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోలవరం కాంట్రాక్టర్లను మార్చే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. ఇక పీపీఏల(విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు) విషయంలో కేంద్రం సూచనను రాజకీయంగా చూడొద్దని జగన్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.