Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. బీజేపీ తీవ్ర ఆరోపణలు

బీజేపీ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అదే ట్విట్టర్ వేదికగా గట్టిగానే బదులిచ్చారు. ‘‘పూర్తిగా చెత్తతో నిండిపోయిన బీజేపీ చెత్త డిపార్ట్‭మెంట్ నుంచి ఎడిటింగ్ చేసి వచ్చిన వీడియో అది. భారత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చిల్లర పనులకు దిగుతోంది

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. బీజేపీ తీవ్ర ఆరోపణలు

BJP claims 'Pakistan zindabad' slogan raised during Bharat Jodo Yatra

Updated On : November 25, 2022 / 3:49 PM IST

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ షేర్ చేసిన వీడియోలోనే ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కాగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండింగ్ వీడియోలను షేర్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అలాంటి వాటికి తాము కూడా సిద్ధమయ్యాని కాంగ్రెస్ ప్రతిదాడికి దిగింది. ఒకవేళ బీజేపీ తప్పుడు సమాచారంతో దాడి చేస్తే, తాము కూడా తప్పుడు సమాచారంతో తిప్పి కొడతామని కాంగ్రెస్ నేరుగానే చెప్తోంది.

శుక్రవారం బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ ఖాతాలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చూస్తూ ‘‘రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో యాత్రలో రిచా చద్దా పాల్గొంటున్నట్లు ప్రకటన వచ్చిన అనంతరం జరిగిన సంఘటన ఇది. వీడియో చివరి వరకు సరిగ్గా చూడండి. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ పోస్ట్ చేశారు. అయితే ఇందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే డిలీట్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు నిజస్వరూపం’’ అని ట్వీట్ చేశారు.

కాగా, బీజేపీ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అదే ట్విట్టర్ వేదికగా గట్టిగానే బదులిచ్చారు. ‘‘పూర్తిగా చెత్తతో నిండిపోయిన బీజేపీ చెత్త డిపార్ట్‭మెంట్ నుంచి ఎడిటింగ్ చేసి వచ్చిన వీడియో అది. భారత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చిల్లర పనులకు దిగుతోంది. దీనిపై మేము చట్టబద్ధ చర్యలు తీసుకుంటాము. అలాగే బీజేపీకి నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. మేము కూడా ఇలాంటి ట్రిక్స్‭కు సిద్ధమయ్యే ఉన్నాం. వాటి రుచి మీకు తొందరలోనే చూపిస్తాం’’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

Viral Audio: రహస్య భాగాలు కత్తిరిస్తానంటూ మహిళ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత