మంత్రి అండతోనే రేవ్ పార్టీ : బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

విశాఖలో రేవ్ పార్టీ దుమారం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అండదండలతోనే విశాఖపట్నంలో

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 02:29 PM IST
మంత్రి అండతోనే రేవ్ పార్టీ : బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Updated On : May 5, 2019 / 2:29 PM IST

విశాఖలో రేవ్ పార్టీ దుమారం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అండదండలతోనే విశాఖపట్నంలో

విశాఖలో రేవ్ పార్టీ దుమారం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అండదండలతోనే విశాఖపట్నంలో రేవ్‌ పార్టీ  జరిగిందని విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. ప్రత్యేక దర్యాఫ్తు సంస్థ ఏర్పాటు చేసి రేవ్ పార్టీ కేసుపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కోడ్‌ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, మంత్రి పేషీ నుంచి అనేకసార్లు ఎక్సైజ్‌ అధికారులకు ఫోన్లు వెళ్లాయని విష్ణు కుమార్ రాజు చెప్పారు. బీచ్‌ ఫ్రంట్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులకు ధైర్యం లేదన్నారు.

డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే బీచ్‌ఫ్రంట్‌ నిర్వాహకులను విచారించడం లేదన్నారు. రేవ్ పార్టీ కేసులో అసలు నిందితులను తప్పించారని ఆయన  ఆరోపించారు. విశాఖలో బయటపడిన రేవ్‌ పార్టీపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప స్పందించకపోవడం దారుణం అని విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవ్‌ పార్టీ కల్చర్‌ పై విష్ణుకుమార్ రాజు  ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్‌ రాజధానిగా విశాఖ మారుతుందన్నారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని బీచ్‌ రోడ్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. యువత మద్యం మత్తులో అసభ్యకరమైన డ్యాన్సులతో రెచ్చిపోయింది.