KTR On Chandrababu Naidu : కవిత అరెస్ట్.. చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన పోస్టు వైరల్

చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

KTR On Chandrababu Naidu : కవిత అరెస్ట్.. చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన పోస్టు వైరల్

KTR On Chandrababu Naidu : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. కాగా, కవిత అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కవిత అరెస్ట్ అక్రమం అని, ఇందులో కుట్ర ఉందని, దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఇది బీజేపీ చేసిన కుట్ర అని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. కవిత అరెస్ట్ పై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో చేసిన ఓ పోస్టును కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడా పోస్టు వైరల్ గా మారింది.

సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా సీబీఐ, ఈడీ లాంటి విచారణ సంస్థలను దుర్వినియోగం చేయడం బాధాకరం. బీజేపీ.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతుందో చూడొచ్చు. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు ఎందుకు? అంటూ గతంలో చంద్రబాబు చేసిన ట్వీట్ ను.. తాజాగా కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సీబీఐ, ఈడీ దాడుల గురించి నారా చంద్రబాబు నాయుడు కంటే నేను గొప్పగా చెప్పలేను అంటూ ఆయన కామెంట్ కూడా జత చేశారు.

చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక స్ట్రాటజీ అదే..! ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ