Padi Kaushik Reddy : ప్రజలు ఛీ కొడుతున్నారు- దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Padi Kaushik Reddy : ప్రజలు ఛీ కొడుతున్నారు- దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

Padi Kaushik Reddy

Updated On : March 30, 2024 / 6:02 PM IST

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని మార్చి 18న స్పీకర్ ను కలిశామని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ఆయన అన్నారు. మరోసారి స్పీకర్ ను కలుద్దామని వెళ్తే ఎవరూ లేరని అన్నారు. దానంపై అనర్హత వేటు వేసేలా అదనంగా ఆధారాలు సమర్పించేందుకు వెళ్ళామని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకుని దానంపై అనర్హత వేటు వేస్తే చరిత్రలో నిలిచి పోతారని కామెంట్ చేశారు.

స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రిజిస్టర్ పోస్టు ద్వారా స్పీకర్ కు పంపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారికంగా దానంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

ఇక, కడియం శ్రీహరిపైనా కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. కడియం శ్రీహరిని ప్రజలు ఛీ కొడుతున్నారుని మండిపడ్డారు. అన్నం తినే వాళ్ళు ఎవరూ కడియంలా చేయరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చర్యకు ప్రతిచర్య తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చారు. రైతులకు మద్దతు కోసమే కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని కౌశిక్ రెడ్డి చెప్పారు.

Also Read : 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది- బీజేపీ నేత వార్నింగ్