ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ ఫిక్స్

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 09:49 AM IST
ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ ఫిక్స్

Updated On : October 10, 2019 / 9:49 AM IST

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి, రాంచరణ్ భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాని చూడాలని చిరంజీవి, రాంచరణ్ సీఎం జగన్ ని కోరనున్నారని సమాచారం. అలాగే సీఎంగా ఎన్నికైన జగన్ కు అభినందనలు తెలపనున్నారని తెలుస్తోంది. ఏపీలో సైరా చిత్రం ప్రత్యేక షోలు వేసేందుకు జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకుగాను చిరంజీవి ధన్యవాదాలు తెలపనున్నారు. ఇకపోతే జగన్ సీఎం అయ్యాక ఇప్పటివరకు చిరు కలిసింది లేదు.

జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ పెద్దలెవరూ జగన్ ని కలిసింది లేదు. దీనిపై వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో దిల్ రాజు, అశ్వినీదత్ వంటి నిర్మాతలు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా.. అపాయింమెంట్ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. తాజాగా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ చిరంజీవి కోరడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. సినిమా చూసిన తెలంగాణ గవర్నర్.. సైరా బాగుందని ప్రశంసించారు.

ప్రస్తుతం సీఎం జగన్ అనంతపురం పర్యటనలో ఉన్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో.. చిరంజీవి తొలిసారి జగన్ ను కలవటానికి అమరావతి వెళ్తున్నారు. దీంతో..ఈ భేటీ పై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.