విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : సీఎం చంద్రబాబు

విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 09:40 AM IST
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : సీఎం చంద్రబాబు

విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.

విశాఖ : విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచానికే విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం సుందరనగరం అని కొనియాడారు. విశాఖ నాలెడ్జ్ హబ్ గా మారుతోందన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రం కోసం కష్టపడ్డానని తెలిపారు. హుదుద్ తుపాను వచ్చినప్పుడు 10 రోజులు ఇక్కడే ఉండి శ్రమించానని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. పేదల ఆత్మాభిమానం దెబ్బతినకుండా మరుగుదొడ్లు కట్టించామని చెప్పారు. పింఛన్లు పెంచాం..డ్వాక్రా చెల్లెమ్మలను ఆదుకున్నామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.9 వేలు ఇస్తున్నామన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయంలో 11 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఆటోలో ఎక్కే ప్రతి ఒక్కరూ టీడీపీకే ఓటేయాలని కోరారు. ’రాష్ట్రానికి నేను డ్రైవర్ నంబర్ వన్’ అని అన్నారు. టీడీపీ వస్తే ఉద్యోగాలొస్తాయన్నారు బాబు. ’జగన్ ను నమ్ముకుంటే మోసాలు..మమ్మల్ని నమ్ముకుంటే అభివృద్ధి’ అని చెప్పారు. చిన్న కోడికత్తి కేసుకు ఎన్ ఐఏ విచారణనా అని ప్రశ్నించారు. నేరచరితులకు ప్రధానమంత్రి కార్యాలయం రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు.