జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయి : సీఎం చంద్రబాబు
జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.

జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి : జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మేలు కోసం మోడీ, కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు, నాయకులకు ప్రలోభాలు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక మూలాను దెబ్బతీస్తూ వదంతులతో అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. అమరావతిలో మార్చి 21 గురువారం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మైండ్ గేమ్ తో ఆదాల ప్రభాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణ మోహన్, మాగుంట శ్రీనివాస్ ను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని జగన్ అంటారు..ఆంధ్రా ప్రజల ఓట్లు మాత్రం కావాలంటారని విమర్శించారు. చిన్నాన్న (వివేకానందరెడ్డి) హత్య కేసును జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.