దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ : కేసులు పెట్టి, వేధించి, అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంది. కోడెలది ప్రభుత్వ హత్య అని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి,

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 03:29 AM IST
దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ : కేసులు పెట్టి, వేధించి, అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు

Updated On : September 17, 2019 / 3:29 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంది. కోడెలది ప్రభుత్వ హత్య అని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి,

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంది. కోడెలది ప్రభుత్వ హత్య అని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి, వేధించి, అవమానించి కోడెల ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేశారని ముద్ర వేసి ప్రాణం తీసుకునేలా చేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ నేతని ఇలా ఎక్కడా వేధించలేదన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) హైదరాబాద్ లో కోడెల భౌతికకాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కోడెల అంటే పల్నాడు పులి అని చంద్రబాబు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఇలా ముగియడం బాధాకరం అన్నారు. ఈ నేరం క్షమించరానిది అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఏం జరిగిందో అందరికి తెలుసు అన్నారు. ఫర్నీచర్ అందరికి ఇస్తారు.. చాలాసార్లు నామినల్ వాల్యూ కట్టి సెటిల్ చేస్తారు అని చంద్రబాబు వివరించారు. జగన్ ప్రభుత్వం కోడెల కుటుంబసభ్యులను వేధించిందన్నారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు కోడెలను వేధించారని చంద్రబాబు ఆరోపించారు. తప్పులు చేసినవారు కూడా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ ఫర్నీచర్ గురించి కోడెల నాలుగు లేఖలు రాశారని చంద్రబాబు వివరించారు. స్పీకర్ పదవి ముగిశాక ఫర్నీచర్ తీసుకెళ్లమని కోడెల లేఖలు రాసినా అధికారులు పట్టంచుకోలేదన్నారు. ఒక సీనియర్ నేతను ఇంతలా వేధించిన ఘటనలు దేశ రాజకీయాల్లో లేవన్నారు. వైసీపీ టెర్రరిస్టు ప్రభుత్వం కాదు.. అంతకంటే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు.