అమరావతి అనే భ్రమరావతిని క్రియేట్ చేశారు : చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.

రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.
రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ అమరావతిలో భవనాలు తాత్కాలికమైనవని చెప్పింది చంద్రబాబే అన్నారు. రాజధాని కోసం నారాయణ అనే సొంత కమిటీని చంద్రబాబు వేసుకున్నారని తెలిపారు. రాజధాని ఖర్చుపై చంద్రబాబు మాట్లాడిన వీడియోను జగన్ ప్రదర్శించారు.
1953 నుంచి పదే పదే చారిత్రక తప్పిదాలు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా కథనాలను సభలో సీఎం జగన్ ప్రదర్శించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. సూపర్ కేపిటల్ వద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఏపీలో ఇవాళ చారిత్రాత్మకమైన రోజు అన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలు అభివృద్ధి వీకేంద్రీకరణకు ఓటు వేశాయని వెల్లడించారు.
రాజధాని విషయంలో చంద్రబాబు అందరిని తప్పుదోవ పట్టించారని తెలిపారు. నూజివీడు, నాగార్జున యూనివర్శిటీ వైపు అని లీకులిచ్చారని చెప్పారు. లీకులిచ్చిన నేతలు అక్కడ భూములు కొనకుండా అమరావతి పరిసరాల్లో ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. 2016 నుంచి తమ ప్రభుత్వం వచ్చే వరకు తూర్పుగోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారని పేర్కొన్నారు. అమరావతిలో రెండు రోజులు 144 సెక్షన్ పెడితే గగ్గోలు చేస్తున్నారని మండిపడ్డారు.