మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు వైసీపీ షాక్
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.

Vasantha Venkata Krishna Prasad
Vasantha Venkata Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. మైలవరం ఇంఛార్జిగా శ్వర్నాల తిరుపతి రావుని ఖరారు చేసింది అధిష్టానం. తిరుపతి రావు ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం ఇంఛార్జిగా నియమిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నేతలు కేశినేని నాని, జోగి రమేశ్ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చర్చించారు.
Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్ ఎంపీలకూ టికెట్లు..!
మైలవరం వైసీపీ ఇంఛార్జిగా శ్వర్నాల తిరుపతి రావును ఖరారు చేసింది హైకమాండ్. ఆయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయననే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్.
మైలవరం నుంచి ఎవరు పోటీ చేస్తారు? అనే హైడ్రామా చాలారోజులుగా నడిచింది. అభ్యర్థిపై అనిశ్చితి నెలకొంది. మైలవరం నుంచి జోగి రమేశ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇక ఇటీవల ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, ఏలూరులో జరిగే సిద్ధం బహిరంగ సభకు కూడా తాను రాను అంటూ సమాచారం ఇవ్వడం.. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీసీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని, చంద్రబాబుని కూడా కలిశారని, పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు అనే సమాచారం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం.. మైలవరం నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జిని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక, ఇప్పటికే ఈ నెల 4 లేదా 5న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ ఇదివరకే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read : వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఏడు ఎంపీ స్థానాలు..!