CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.

CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు. CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ లేని బర్త్ సర్టిఫికెట్లు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు.
‘‘నేను మా ఊరిలో మా సొంతింటిలో పుట్టా అని తెలిపారు. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదన్నారు. నాదే లేదంటే నా తండ్రిని, తాతలది రికార్డులు తెమ్మంటే ఎలా’’ అని అన్నారు. దళితులు, పేదవాళ్లకు బర్త్ సర్టిఫికెట్ ఎక్కడు నుంచి వస్తాయన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో నిరక్షరాసత్యపై కాంగ్రెస్ నేతలు తమను ప్రశ్నిస్తున్నారని.. నిరక్షరాస్యతకు కారకులెవరు అన్నారు. కాంగ్రెస్ వాళ్లు 100 శాతం అక్షరాస్యత సాధించి ఇస్తే…తాము నిరక్షరాస్యులుగా మార్చామా అన్నారు.(కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్)