అమరావతి అయోమయం : కొన్ని గంటల్లోనే రాజధానిపై మాట మార్చిన బొత్స
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ

ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ క్లారిటీ లేదా? అమరావతి గ్రౌండ్‌లోకి దిగితే ఏం తెలుస్తోంది?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని.. అమరావతి నుంచి మారుస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి.. మంత్రి బొత్స సత్యనారాయణ మండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేయడంతో.. కేపిటల్ ఎక్కడికీ పోదని అంతా అనుకున్నారు. కానీ.. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే.. మంత్రి బొత్స మాట మార్చారు. రాజధానిపై.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు
బొత్స వ్యాఖ్యలతో కేపిటల్ సీన్ మళ్లీ మొదటికి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజధానిపై అనుమానాలు నెలకొన్నాయి. రాజధాని మార్చబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే.. కేపిటల్ విషయంపై.. సీఎం జగన్ నేరుగా స్పందించ లేదు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని.. ఒక్కోసారి ఒక్కో స్టేట్‌మెంట్ ఇచ్చి.. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేశారు. దీనిపై.. సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహ ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి.. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. అయినా.. వైసీపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. సీఆర్డీఏ సమీక్షలో మాత్రం.. ఇప్పుడున్న అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం జగన్ అన్నట్లు వార్తలొచ్చాయి.
రాజధానిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక మేరకు నిర్ణయం ఉంటుందని మరో మెలిక పెట్టారు. దీంతో.. ఏపీ ప్రజల్లో మళ్లీ అయోమయం మొదలైంది. ఇదివరకే.. అమరావతి ప్రాంతంలోని భూమి.. భారీ నిర్మాణాలకు అనువుగా లేదని బొత్సతో పాటు మిగిలిన మంత్రులు చాలా చెప్పారు. ఒకవేళ.. నిపుణుల కమిటీ అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణాలకు అనువుగా లేదని నివేదిక ఇస్తే.. ఇప్పటి నిర్మించిన నిర్మాణాల పరిస్థితేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో.. అంతా గందరగోళంగా మారిపోయింది.