2024 Eelctions: మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం.. 9-4-1 ఫార్ములాతో పోటీకి హస్తం పార్టీ వ్యూహాలు

కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాల్లో విజయం సాధించింది

2024 Eelctions: మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం.. 9-4-1 ఫార్ములాతో పోటీకి హస్తం పార్టీ వ్యూహాలు

Updated On : June 21, 2023 / 7:09 PM IST

Jharkhand: మిత్ర పార్టీలపై పెత్తనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిద్ధమవుతోంది. కొద్ది సంవత్సరాలుగా ఘోర అపజయాలతో ఉన్న ఆ పార్టీ.. ఇన్నాళ్లు మిత్రపక్షాల సూచనలను తప్పనిసరి పరిస్థితుల్లో వింటూ వచ్చింది. అయితే కర్ణాటక విజయంతో కొత్త ఊపిరి వచ్చింది. ఇక ఇదే సమయం అనుకుని మరోసారి తన పెత్తనానికి పూనుకుంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జర్ఖాండ్ రాష్ట్రంలో పోటీకి కొత్త ఫార్ములాను కాంగ్రెస్ రూపొందించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో మరో రెండు స్థానాల్లో పోటీ చేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ భావిస్తోంది.

Karnataka Politics: నేషనల్ ఎడ్యుకేషన్‌ పాలసీని పక్కన పెట్టిన కర్ణాటక సర్కార్.. కొత్త పాలసీ తయారు చేస్తామని ప్రకటన

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 9-4-1 ఫార్ములాపై 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది. వాస్తవానికి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కి 4 సీట్లు, ఆర్జేడీకి ఒక్క సీటు మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ 9 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోందట. అయితే ఈ సీట్ల పంపకంపై జేఎంఎం, ఆర్జేడీలతో కాంగ్రెస్ ఇంకా చర్చించలేదు. కానీ మహాకూటమి సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఈ విషయాన్ని సూచించినట్లు తెలుస్తోంది.

Goa G20 Meet: గోవా జీ-20 సమావేశాలు.. అమెరికా నుంచి కీలక సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ

హజారీబాగ్, వెస్ట్ సింగ్‌భూమ్, ఛత్రా, గొడ్డా, ధన్‌బాద్, రాంచీ, ఖుంటి, లోహర్‌దగా, కోడెర్మా స్థానాలు కాంగ్రెస్‌కి ఎంపికలో ఉన్నాయి. అయితే గత ఎన్నికలో పశ్చిమ సింగ్‌భూమ్ ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గెలిచింది. బీజేపీకి చెందిన లక్ష్మణ్ గిలువాపై కాంగ్రెస్ అభ్యర్థి గీతా కోడా విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం, జేవీఎం, ఆర్జేడీ మహాకూటమిలో ఉన్నాయి. ఇందులో జేఎంఎం నాలుగు స్థానాల్లో పోటీ చేయగా, అందులో రాజమహల్ సీటును గెలుచుకుంది. ఇక ఆర్జేడీ, జేవీఎం ఒక్క సీటు కూడా గెలవలేదు

జేవీఎం స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది
గత ఎన్నికల్లో జేఎంఎం అధినేత శిబు సోరెన్, దుమ్కా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక జేవీఎం ప్రస్తుతం పోటీలో లేనందున జేవీఎం స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బిహార్ కూటమిలో లెఫ్ట్ పార్టీలు ప్రధాన పోటీలో ఉన్నందున.. జార్ఖండ్ యూపీఏ కూటమిలోకి వారు ప్రవేశిస్తే.. ఈ పంపకాల చిత్రం మారవచ్చని అంటున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. హజారీబాగ్ నుంసీ పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు.

2019లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి
కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో, దాని మిత్రపక్షం ఏజేఎస్‭యూ పార్టీ గిరిడిహ్ స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. మహాకూటమిలో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, జేఎంఎం నాలుగు స్థానాల్లో, జేవీఎం రెండు స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో పోటీ చేశాయి.

విపక్షాల సమావేశం తర్వాత నిర్ణయం
మరోవైపు సీట్ల పంపకానికి సంబంధించి జూన్ 23న పాట్నాలో సమావేశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. దీని తర్వాత జార్ఖండ్‌లో సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తాము గత సారి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ గతం కంటే మరింత బలపడిందని రాజేష్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను దాటి చాలా మండలాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఇన్‌చార్జి అవినాష్ పాండే స్వయంగా అన్ని జిల్లాల్లో మూడుసార్లు పర్యటించారు.