ట్రిపుల్ తలాఖ్: రాహుల్, మమతాకు చంద్రబాబు ఫోన్

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 07:23 AM IST
ట్రిపుల్ తలాఖ్: రాహుల్, మమతాకు చంద్రబాబు ఫోన్

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు.

గుంటూరు : ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ట్రిపుల్ తలాఖ్ అంశంపై వారితో చర్చించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడాలన్నారు. బీజేపీ ముస్లీం వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని పిలుపు ఇచ్చారు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పోకడలను అడ్డుకోవాలన్నారు. 

నాన్ బీజేపీ వర్గాలన్నీ ఏకం కావాలి 
దేశ భవిష్యత్ ను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బాబు విమర్శించారు. ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకంగా నాన్ బీజేపీ వర్తాలన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ ను బలవంతంగా రుద్దడం లౌకికవాదానికి ముప్పు అన్నారు. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని సూచించారు.