Digvijay Singh: కాంగ్రెస్ కస్సుమన్నా వెనక్కి తగ్గని దిగ్విజయ్.. మళ్లీ ప్రశ్నల వర్షం

వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్లి చేసుకున్నారని అన్నారు

Digvijay Singh: కాంగ్రెస్ కస్సుమన్నా వెనక్కి తగ్గని దిగ్విజయ్.. మళ్లీ ప్రశ్నల వర్షం

digvijay singh never step back, attack modi once again

Updated On : January 24, 2023 / 8:21 PM IST

Digvijay Singh: సర్జికల్ దాడులపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‭కు అధికార భారతీయ జనతా పార్టీ నుంచే కాదు, సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. కాషాయ నేతలేమో ఆయన వ్యాఖ్యలపై మండిపడుతుంటే, కాంగ్రెస్ నేతలేమో ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. విపక్ష పార్టీ విమర్శలంటే వేరు కానీ, స్వపక్షం నుంచి విముఖత వచ్చినా కూడా దిగ్విజయ్ మాత్రం తగ్గడం లేదు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.

Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే

వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్లి చేసుకున్నారని అన్నారు. ”మోదీ ప్రభుత్వాన్ని కొన్ని విలువైన ప్రశ్నలు అడుగుతున్నాను. బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు తెలుసుకునే హక్కు నాకు లేదా? తీవ్రమైన తప్పిదాలు జరిగితే ఎవరిని శిక్షిస్తారు? మిగతా ఏ దేశంలోనైనా హోంమంత్రి చేత రాజీనామా చేయించేవారు” అని దిగ్విజయ్ అన్నారు. తన ప్రశ్నలకు మోదీ సర్కార్ సమాధానం చెప్పాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

RRR : చరిత్ర సృష్టించిన నాటు నాటు.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సాంగ్..

మోదీకి దిగ్విజయ్ సంధించిన ప్రశ్నలు..
ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణం పొందారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్‌డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది?
సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని వాయుమార్గంలో తరలించాలంటూ సీఆర్‌పీఎఫ్ చేసిన విజ్ఞప్తిని ఎందుకు నిరాకరించారు?
ఉగ్రవాదులతో సహా జమ్మూకశ్మీర్ పోలీసులకు పట్టుబడిన పుల్వామాకు చెందిన డిప్యూటీ ఎస్‌పీని ఎందుకు వదిలిపెట్టేశారు?
ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన పుల్వామాలో దాడి జరిగిన రోజు వాహనాలను ఎందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయలేదు?