Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే

ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డీజీసీఏ జరిమానా విధించింది.

Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే

Air India: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తనపై ఫిర్యాదు చేయనందుకుగాను ఆ సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో మరోసారి ఎయిర్ ఇండియా వివాదంలో చిక్కుకుంది.

Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డీజీసీఏ జరిమానా విధించింది. గత డిసెంబర్ 6న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విమానంలో పొగ తాగాడు. అలాగే మద్యం కూడా సేవించి ఉన్నాడు. విమానయాన సిబ్బంది చెప్పిన సూచనల్ని అతడు పట్టించుకోలేదు.

India vs New Zealand: రోహిత్, గిల్ సెంచరీలు.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 386

అలాగే ఒక సీటులో మహిళకు కేటాయించిన బ్లాంకెట్‌ను తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 5న విషయం వెలుగు చూడగా, దీనిపై డీజీసీఏ ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగి చాలా రోజులవుతున్నా బాధ్యుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని డీజీసీఏకు ఎందుకు నివేదించలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని డీజీసీఏ పేర్కొంది. దీనికి ఎయిర్ ఇండియా సంస్థ సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంపై డీజీసీఏ సంతృప్తి చెందలేదు. దీంతో ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.