టీడీపీకి షాక్.. కేంద్ర మాజీమంత్రి రాజీనామా, కారణం ఏంటంటే?

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.

టీడీపీకి షాక్.. కేంద్ర మాజీమంత్రి రాజీనామా, కారణం ఏంటంటే?

Kishore Chandra Deo

Updated On : February 15, 2024 / 7:37 PM IST

Kishore Chandra Deo : పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై టీడీపీ చర్చలు జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయం అన్నారు కిశోర్ చంద్రదేవ్.

Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..

అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.

బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఓ దఫా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, పొత్తుల అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్డీయేలో టీడీపీ చేరికపైనా చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. టీడీపీ-బీజేపీ పొత్తు అంశంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.