ఎలుక చేరిందని ఇంటిని తగలబెడతారా ? : సీఎం జగన్ పై చింతమనేని ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 07:00 AM IST
ఎలుక చేరిందని ఇంటిని తగలబెడతారా ? : సీఎం జగన్ పై చింతమనేని ఆగ్రహం

Updated On : January 7, 2020 / 7:00 AM IST

ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు.

ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరు, జగన్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం (జనవరి 7, 2020) విజయవాడలో 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ జగన్ జీవితమే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. 

ఇష్టమైన వారితో కమిటీలు వేసి నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికలకు విశ్వసనీయత లేదన్నారు. అమరావతిపై అఖిలపక్ష కమిటీ ఎందుకు వేయరని ప్రశ్నించారు. న్యాయమూర్తులతో కమిటీ వేయొచ్చన్నారు. రాజధానిని మార్చడం మాయనిమచ్చ అన్నారు. వైసీపీ పాలకులు అమరావతిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 

రాజధాని రైతులకు అమరావతిని దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. విశాఖ రాజధాని కావాలని ప్రజలు అడిగారా అని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే చేసిన వారిని శిక్షించాలన్నారు.