చంద్రబాబుతో ఆమంచి భేటీ : పార్టీ మారే విషయంపై దాటవేత

విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమంచి భేటీ అయ్యారు. మంత్రి శిద్ధా రాఘవరావుతో కలిసి ఆమంచి నేరుగా సీఎం ఇంటికే వెళ్లారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్‌తో 10tvతో మాట్లాడారు. రాజకీయ పార్టీలో ఉన్న సమయంలో…ఒక కంఫ్టర్ లేకపోతే తనకున్న అభిప్రాయాలను కార్యకర్తలు..అధిష్టానంతో చర్చించే హక్కు తనకుందన్నారు. అందులో భాగంగా బాబుతో మాట్లాడినట్లు చెప్పారు. సామాన్య వ్యక్తిగా ఉన్న తాను.. ఈ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. నిజాయితీగా రాజకీయాలు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని.. పైరవీలు, అవినీతికి పాల్పడే వ్యక్తిని కాదన్నారు. ప్రస్తుతానికి టీడీపీలో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానన్నారు శ్రీనివాస్. మరి ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.