నాకు సీఎం కావాలని ఉంది..ఏం రేవంత్‌కు ఒక్కడికే ఉంటదా – జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్‌కు ఆశలున్నాయి..నాకు ఉంది..పీసీసీ పదవి కావాలని ఉంది..రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అనుచరులకు..నాకు సీఎం కావాలని ఉంది..ఏం కావొద్దా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రేవంత్ అనుచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వెంటనే దీనిని ఆపేయాలని, లేనిపక్షంలో ఢిల్లీకి వెళ్లి అన్ని చెబుతానన్నారు. 2020, మార్చి 12వ తేదీ గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలకు సీఎం పదవి కావాలని ఉందని, కానీ ఎవరు సీఎం కావాలో సోనియా, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారన్నారు. ఇక తమాషాలు బంద్ చేయండి..రేవంత్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ను తక్షణమే పక్కకు పెట్టాలని, పార్టీని ఎలా పైకి తీసుకరావాలో తమకు తెలుసన్నారు. హీరో..హీరో అంటూ రేవంత్‌ను పైకి ఎక్కిస్తున్నారని, మరి ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. ప్రస్తుతం తాము చుక్కలు చూస్తున్నాం..పైసలు లేనిదే రాజకీయం నడువద్దన్నారు.
పార్టీలో రేవంత్ ఒక్కడే ఉన్నాడా ? తన మీద ఒక ఆరోపణలు వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. దీనిని పార్టీకి రుద్దానా ? అని ప్రశ్నించారు. గవర్న్‌మెంట్ దగ్గర బలం ఉంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా..ఇలాగే చేస్తారని, ఈ క్రమంలో తప్పులు చేయవద్దని సూచించారు.
పాస్ పోర్టు కేసులు, ఇతరత్రా విషయాల్లో తనపై ఆరోపణలు వచ్చాయని, తనను కూడా ఎప్పుడు జైల్లో పెడుతారో తెలియదని..దీనికి పార్టీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. వీరుడు, ధీరుడు బలవంతుడు ముందు పనిచేయదన్నారు. వెంటనే ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారాన్ని ఆపేయాలని మరోసారి డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.
Read More : రేవంత్ తీస్ మార్ ఖానా..ఏం తమాషా అవుతుందా : జగ్గారెడ్డి ఫైర్