PM Competition: మోదీ, రాహుల్ మధ్య ప్రధాని పోటీ.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యే ఎక్కువగా జరుగుతోంది. చర్చను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ న్యూస్ సీ ఓటర్ ఆల్ ఇండియా సర్వే నిర్వహించింది. ఈ స‌ర్వేలో దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి గురించి ఓ ప్ర‌శ్న‌ అడగ్గా.. ప్రజల దగ్గరి నుంచి చాలా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి

PM Competition: మోదీ, రాహుల్ మధ్య ప్రధాని పోటీ.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు

Updated On : August 20, 2023 / 9:03 PM IST

Modi vs Rahul: తొందరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇవి అయిపోగానే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈసారి ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధాని అభ్యర్థుల జాబితాలో చాలా మందే ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ చర్చ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యే ఎక్కువగా జరుగుతోంది.

అయితే చర్చను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ న్యూస్ సీ ఓటర్ ఆల్ ఇండియా సర్వే నిర్వహించింది. ఈ స‌ర్వేలో దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి గురించి ఓ ప్ర‌శ్న‌ అడగ్గా.. ప్రజల దగ్గరి నుంచి చాలా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ మధ్య నేరుగా ప్రధానిని ఎన్నుకోవాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేసుకుంటారని ప్రశ్నించగా.. 71 శాతం మంది నరేంద్రమోదీనే ఎన్నుకున్నారు. ఇక రాహుల్ గాంధీకి కేవలం 24 శాతం మాత్రమే ఓట్లు రావడం గమనార్హం. ఇక వీరిద్దరు కాకుండా ఈ ఇద్దరూ కాదని 4 శాతం మంది అభిప్రాయపడగా.. ఇద్దరిలో ఎవరవుతారో తెలియదని ఒక శాతం మంది చెప్పారు.

మోదీ, రాహుల్ మధ్య ప్రత్యక్ష ప్రధానిని ఎంచుకోవాలనుకుంటే, మీరు ఎవరిని ఎన్నుకుంటారు?
నరేంద్ర మోదీ-71%
రాహుల్ గాంధీ – 24%
రెండూ కాదు – 4%
తెలియదు – 1%

అయితే ఈ సర్వే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మాత్రమే నిర్వహించారు. ఆ రాష్ట్రాల్లోని ప్రజల అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నారు. వాస్తవానికి ఈ సర్వే ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపనుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసి రాజకీయ వేడిని పెంచింది. అటువంటి వాతావరణంలో తాజా సర్వే నిర్వహించడం చర్చనీయాంశమైంది.