అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తాం : జగన్

వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 12:04 PM IST
అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తాం : జగన్

Updated On : March 17, 2019 / 12:04 PM IST

వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

విశాఖ : వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారి చేస్తామని తెలిపారు. పాదయాత్రలో 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను.. వారి బాధలు చూశానని చెప్పారు. నర్సీపట్నంలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. 

2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా…భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నారు. రైతు భరోసా కింద అన్నదాతకు రూ.12,500 ఇస్తామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందమన్నారు. పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కనీస వసతులు లేవని విమర్శించారు. ఆదుకోవాల్సిన 108 రావడం లేదన్నారు. చంద్రబాబు వద్ద అవినీతి సొమ్ము చాలా ఉందని ఆరోపించారు జగన్. రూ.3 వేలు చేతిలో పెట్టి ఓట్లు అడుగుతారని.. మరోసారి మోసపోవద్దన్నారు. 

’మీ పిల్లలను బడికి పంపించండి ..వారి చదువులకు ఎంత ఖర్చైనా భరిస్తాం’ అని చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకంతో వృద్ధులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాల అప్పులను 4 దఫాల్లో రద్దు చేస్తామని చెప్పారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ధర్మం, ఆధర్మం మధ్య పోరాటం జరుగుతుందని తెలిపారు. కురుక్షేత్రంలో ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని కోరారు.