పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా : జనసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో

జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో
జనసేన నేత పవన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ ఆదేశిస్తే జనసేన కార్యకర్తలను వేధిస్తున్న వైసీపీ నేతల తలలు నరుకుతా అన్నారు. పవన్ రెడీ అంటే మేమూ రెడీనే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా రాప్తాడు జనసేన నేత పవన్ కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ సమక్షంలోనే ఆయనీ మాటలు అన్నారు.
అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని పవన్ కుమార్ ఆరోపించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. జనసేనాని ఆదేశిస్తే ఒక్క ప్రకాశ్ రెడ్డి తల కాదు.. ఏ రెడ్డి తలనైనా నరికి తీసుకొస్తా అన్నారు.
పవన్ కుమార్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ స్పందించారు. పవన్ కుమార్ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ సమర్థించారు. ఎంతో ఆవేదన చెందాడు కాబట్టే పవన్ కుమార్ ఆ మాట అన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ నేతలు ఎన్నోసార్లు రాప్తాడు పవన్ కుమార్ ని బెదిరించారని పవన్ వాపోయారు. మాజీ సీఎం చంద్రబాబుని ఉరి తీయాలని జగన్ అన్నారని గుర్తు చేసిన పవన్.. నాడు జగన్ పై ఏ కేసు పెట్టారో ఇప్పుడు పవన్ కుమార్ పైనా అదే కేసు పెట్టాలన్నారు.
కాగా తలలు నరుకుతా అంటూ పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పవన్ కుమార్ మాటలను బట్టే జనసేన తీరు ఏంటో తెలుస్తుందని అన్నారు. కార్యకర్తను మందలించాల్సిన అధినేతే.. సమర్థించడం దారుణం అన్నారు. ఇలాంటి కామెంట్స్ తో జనసేనాని సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.