ఢిల్లీకి పవన్ కల్యాణ్.. పొత్తులపై బీజేపీ పెద్దలతో మంతనాలు..!
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.

Pawan Kalyan Delhi Tour
Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పొత్తుల అంశంపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హస్తిన బాట పట్టారు. పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
Also Read : టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు వీళ్లే?
బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.
Also Read : టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం