Pawan Kalyan : నేను పోటీ చేసేది అక్కడి నుంచే..! స్వయంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan : నేను పోటీ చేసేది అక్కడి నుంచే..! స్వయంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan To Contest From Pithapuram

Pawan Kalyan : పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు జనసేనాని పవన్. అంతేకాదు తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన కూడా లేదన్నారు పవన్. నాకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందన్నారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

”ఎమ్మెల్యే, ఎంపీ.. రెండు స్థానాల్లోనూ పోటీ చేయమని చాలామంది పెద్దలు నన్ను కోరారు. కానీ, క్రాస్ ఓటింగ్ ఉంటుందా? నిలబడతామా? లేదా? ఇలాంటి సందేహాలు ఉంటాయి. ఎలా చేద్దాం అనేది ఇంకొన్ని రోజుల్లో నిర్ణయిస్తా. ఒక్క విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులుకు ఇచ్చాం, తిరుపతి శ్రీనివాస్ కి వచ్చాం, గాజువాకను టీడీపీ వాళ్లు తీసేసుకున్నారు. పోనీ, పిఠాపురం తీసుకుందాం అంటే మన ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. ఉదయ్ ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెబుతాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.

మొత్తంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. పవన్ కల్యాణ్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు, ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వచ్చాయి. ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ తన మనసులో మాటను బయపెట్టారు. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం ఇంఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ను అడిగి, పర్మిషన్ తీసుకుని, పిఠాపురంనే ఖాయం చేసుకుందామని అనుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇటు భీమవరం, అటు తిరుపతి.. ఈ రెండు స్థానాలు జనసేనకు కేటాయించడం జరిగింది. ఇక గాజువాకను టీడీపీ తీసుకుంది.

పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అనేదానిపై స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు జనసేనాని. ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి తాను ఇష్టంగా ఉన్నానని పవన్ కల్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు.

Also Read : సీనియర్లకు చంద్రబాబు షాక్..! టీడీపీ రెండో జాబితాలోనూ చోటు దక్కని కీలక నేతలు వీరే