Rachchabanda : ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది

ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.

Rachchabanda : ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది

Jp Suggesstions On Naxalite Vudyamam

Updated On : April 11, 2021 / 6:24 PM IST

JP Suggesstions on Naxalite vudyamam :  ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వానికి నైతికత విశ్వసనీయత ఉన్నాయని ప్రతిమనిషికి అర్ధం అయితే ఉద్యమాలను నిరోధించవచ్చని ఆయన చెప్పారు.

ఇటీవల చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్, 23 మంది జవాన్లు మరణించిన అంశంపై ఈరోజు 10 టీవీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…
అపరిపక్వమైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో చెలరేగిన హింసను ఎదుర్కోవటం తప్ప… రాజ్యానికి మరో మార్గం ఉండదని అన్నారు.

హింసను ఆపలేనప్పుడు అరాచకత్వం పెరుగుతుందని…. సమాజంలో శాంతిని కాపాడటానికి ప్రభుత్వాలు బలప్రయోగం చేపడతాయని ఆయన వివరించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్ధితి నెలకొని ఉందని జయప్రకాష్ నారాయణ చెప్పారు.

ప్రజాసంక్షేమ పధకాలు గ్రామ గ్రామాన పేదలకు అందినప్పుడే ప్రజా వ్యతిరేక ఉద్యామాలను అణచగలమని ఆయన అభిప్రాయ పడ్డారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభ దశకంలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రజాసంక్షేమ పధకాలు అందరికీ అందటం వల్ల కొంతవరకు ఉద్యమాన్ని అణచగలిగారని జేపీ చెప్పారు. ఉద్యమాలను, ఉద్యమకారులను అణగ దొక్కకుండానే ..ప్రజలు ఉద్యమాల వైపు వెళ్లకుండా ప్రభుత్వాలు నివారించగలిగాయని అన్నారు.

మరోవైపు ఎన్నికైన ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడటం… పాలన సజావుగా సాగటం… ప్రభుత్వం పట్ల, ప్రజాసంక్షేమం పట్ల నమ్మకం ఏర్పడి విశ్వసనీయత పెరగటం వల్లకూడా ప్రజలు ఉద్యమాల వైపు వెళ్లకుండా ఆగారని ఆయన అన్నారు.

సంక్షేమ పధకాలు అమలవుతున్న రాష్ట్రాలలో ప్రజా వ్యతిరేక ఉద్యామాలు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. బలప్రయోగం అనివార్యమైనప్పటికీ ప్రభుత్వాలు ప్రజాభిమానాన్ని చూరగొనాలని, పారిశ్రామికీకరణ జరగాలి, ఓటు వల్ల జీవితాలు మారతాయని ప్రజలు నమ్మాలని జయప్రకాష్ నారాయణ చెప్పారు.