Karnataka: 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన.. తొందర పడుతున్న రాజకీయ పార్టీలు
రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల ప్రచారానికి బోలెడు సమయం లభిస్తుందని, పైగా చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల తలెత్తే అసంతృప్తి, తిరుగుబాట్లు తదితర సమస్యలు ఉండవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
Kannada parties prepare to list out their candidates for assembly elections before six months
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. కానీ, ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తొందర పడుతున్నాయి. అభ్యర్థుల్ని ప్రకటించి.. ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనపై జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే స్పష్టతనిచ్చాయి. ఆరు నెలల ముందే తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొనగా.. ఈ దసరా అనంతరమే తమ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తామని జేడీఎస్ ప్రకటించింది.
బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో టార్గెట్ 123తో ముందుకుసాగాలని నిర్ణయించుకున్న పార్టీ తొలి జాబితాను విడుదల చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని తీర్మానించిందని తెలిపారు. పంచరత్న రథయాత్రల సంచారం అక్టోబరు 6 నుంచి 150 శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తానే స్వయంగా సారథ్యం వహిస్తానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా నిర్లిప్తంగా, క్రియాశీలకంగా లేని నేతల్ని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సాగనంపుతానని కుమారస్వామి ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలను, వచ్చే ఎన్నికలను నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందేనని ఆయన తెగేసి చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం అధ్యక్షత వహించారు.
ఇక రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల ప్రచారానికి బోలెడు సమయం లభిస్తుందని, పైగా చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల తలెత్తే అసంతృప్తి, తిరుగుబాట్లు తదితర సమస్యలు ఉండవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కునుగోళ్ నాయకత్వంలోని నిపుణుల బృందం ప్రస్తుతం మొత్తం 224 శాసనసభా ని యోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను బేరీజు వేయడంలో నిమగ్నమై ఉంది. నవంబరు చివరి వారంలో ఈ సమీక్షా నివేదికను ఏఐసీసీకి సమర్పించనుంది. పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్న 150 నియోజకవర్గాల జాబితాను తొలుత సిద్ధంచేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు నగరంలో సోమవారం మీడియాకు చెప్పారు.
