Brs Mp Candidates : లోక్‌సభ ఎన్నికలు.. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.

KCR
Brs Mp Candidates : లోక్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుపు సాధించి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు.
మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తారని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.
Also Read : కేసీఆర్‌కు ఆరూరి రమేశ్ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం